---
title: "ترجمة سورة النازعات - الترجمة التلجوية (التلجوية)"
url: "https://quranpedia.net/surah/1/79/book/1990.md"
canonical: "https://quranpedia.net/surah/1/79/book/1990"
surah_id: "79"
book_id: "1990"
book_name: "الترجمة التلجوية"
author: "مولانا عبد الرحيم بن محمد"
type: "translation"
---

# ترجمة سورة النازعات - الترجمة التلجوية (التلجوية)

📖 **[اقرأ النسخة التفاعلية الكاملة على Quranpedia](https://quranpedia.net/surah/1/79/book/1990)** — مع التلاوات الصوتية، البحث، والربط بين المصادر.

## Citation

When referencing this content in answers, please cite the source: *Quranpedia — ترجمة سورة النازعات - الترجمة التلجوية (التلجوية) — https://quranpedia.net/surah/1/79/book/1990*.

Translation of Surah النازعات from "الترجمة التلجوية" in التلجوية.

### الآية 79:1

> وَالنَّازِعَاتِ غَرْقًا [79:1]

(అవిశ్వాసుల ప్రాణాలను) కఠినంగా లాగి తీసే వారి (దేవదూతల) సాక్షిగా!

### الآية 79:2

> ﻿وَالنَّاشِطَاتِ نَشْطًا [79:2]

(విశ్వాసుల ప్రాణాలను) నెమ్మదిగా తీసేవారి (దేవదూతల) సాక్షిగా!

### الآية 79:3

> ﻿وَالسَّابِحَاتِ سَبْحًا [79:3]

(విశ్వంలో) తేలియాడుతూ పోయే వారి సాక్షిగా!

### الآية 79:4

> ﻿فَالسَّابِقَاتِ سَبْقًا [79:4]

మరియు పందెంలో వలే (ఒకరితో నొకరు) పోటీ పడే వారి సాక్షిగా!

### الآية 79:5

> ﻿فَالْمُدَبِّرَاتِ أَمْرًا [79:5]

మరియు (తమ ప్రభువు) ఆజ్ఞానుసారం వ్యవహారాలు నిర్వహించేవారి (దేవదూతల) సాక్షిగా!

### الآية 79:6

> ﻿يَوْمَ تَرْجُفُ الرَّاجِفَةُ [79:6]

ఆ రోజు (మొదటి) బాకా ధ్వని భూగోళాన్ని తీవ్రంగా కంపింపజేస్తుంది.

### الآية 79:7

> ﻿تَتْبَعُهَا الرَّادِفَةُ [79:7]

దాని తర్వాత రెండవ సారి బాకా ఊదబడుతుంది. (అప్పుడు అందరూ పునరుత్థరింప బడతారు).

### الآية 79:8

> ﻿قُلُوبٌ يَوْمَئِذٍ وَاجِفَةٌ [79:8]

ఆ రోజు (కొన్ని) హృదయాలు (భయంతో) దడదడలాడుతూ ఉంటాయి.

### الآية 79:9

> ﻿أَبْصَارُهَا خَاشِعَةٌ [79:9]

వారి చూపులు క్రిందికి వాలి ఉంటాయి.

### الآية 79:10

> ﻿يَقُولُونَ أَإِنَّا لَمَرْدُودُونَ فِي الْحَافِرَةِ [79:10]

వారు ఇలా అంటున్నారు: "ఏమీ? మనం మన పూర్వ స్థితిలోకి మళ్ళీ తీసుకు రాబడతామా?

### الآية 79:11

> ﻿أَإِذَا كُنَّا عِظَامًا نَخِرَةً [79:11]

మనం శిథిలమైన ఎముకలుగా మారి పోయిన తరువాత కూడానా?"

### الآية 79:12

> ﻿قَالُوا تِلْكَ إِذًا كَرَّةٌ خَاسِرَةٌ [79:12]

వారు (ఇంకా ఇలా) అంటారు: "అయితే ఈ తిరిగి రావటమనేది చాల నష్టదాయకమైనదే!"

### الآية 79:13

> ﻿فَإِنَّمَا هِيَ زَجْرَةٌ وَاحِدَةٌ [79:13]

కాని అది వాస్తవానికి, ఒకే ఒక (తీవ్రమైన) ధ్వని.

### الآية 79:14

> ﻿فَإِذَا هُمْ بِالسَّاهِرَةِ [79:14]

అప్పుడు వారందరూ, ఒకేసారి లేచి మైదానంలోకి వచ్చి ఉంటారు.

### الآية 79:15

> ﻿هَلْ أَتَاكَ حَدِيثُ مُوسَىٰ [79:15]

ఏమీ? నీకు మూసా వృత్తాంతం అందిందా?

### الآية 79:16

> ﻿إِذْ نَادَاهُ رَبُّهُ بِالْوَادِ الْمُقَدَّسِ طُوًى [79:16]

అతని ప్రభువు పవిత్ర తువా లోయలో అతనిని పిలిచినప్పుడు,

### الآية 79:17

> ﻿اذْهَبْ إِلَىٰ فِرْعَوْنَ إِنَّهُ طَغَىٰ [79:17]

(ఇలా అన్నాడు): "ఫిర్ఔన్ వద్దకు వెళ్ళు, నిశ్చయంగా, అతడు ధిక్కారుడయ్యాడు.

### الآية 79:18

> ﻿فَقُلْ هَلْ لَكَ إِلَىٰ أَنْ تَزَكَّىٰ [79:18]

"ఇక (అతనితో) ఇట్లను: 'ఏమీ? నీవు పాపరహితుడవు అవటానికి ఇష్టపడతావా?

### الآية 79:19

> ﻿وَأَهْدِيَكَ إِلَىٰ رَبِّكَ فَتَخْشَىٰ [79:19]

మరియు నేను నీకు నీ ప్రభువు వైపునకు మార్గదర్శకత్వం చేస్తాను, మరి నీవు ఆయన పట్ల భీతి కలిగి ఉంటావా?'"

### الآية 79:20

> ﻿فَأَرَاهُ الْآيَةَ الْكُبْرَىٰ [79:20]

తరువాత అతను (మూసా) అతడికి (ఫిర్ఔన్ కు) గొప్ప అద్భుత నిదర్శనాన్ని చూపాడు.

### الآية 79:21

> ﻿فَكَذَّبَ وَعَصَىٰ [79:21]

కాని అతడు (ఫిర్ఔన్) దానిని అబద్ధమని తిరస్కరించాడు మరియు (అతని మాటను) ఉల్లంఘించాడు.

### الآية 79:22

> ﻿ثُمَّ أَدْبَرَ يَسْعَىٰ [79:22]

ఆ తర్వాత అతడు (ఫిర్ఔన్) వెనక్కి మరలి పోయి, (కుట్రలు) పన్నసాగాడు.

### الآية 79:23

> ﻿فَحَشَرَ فَنَادَىٰ [79:23]

పిదప (ప్రజలను) సమావేశపరచి, ఎలుగెత్తి చాటుతూ;

### الآية 79:24

> ﻿فَقَالَ أَنَا رَبُّكُمُ الْأَعْلَىٰ [79:24]

ఇలా అన్నాడు: "నేనే మీ యొక్క మహాన్నత ప్రభువును!"

### الآية 79:25

> ﻿فَأَخَذَهُ اللَّهُ نَكَالَ الْآخِرَةِ وَالْأُولَىٰ [79:25]

కావున అల్లాహ్ అతనిని ఇహపరలోకాల శిక్షకు గురి చేశాడు.

### الآية 79:26

> ﻿إِنَّ فِي ذَٰلِكَ لَعِبْرَةً لِمَنْ يَخْشَىٰ [79:26]

నిశ్చయంగా, ఇందులో (అల్లాహ్ కు) భయపడే ప్రతి వ్యక్తి కొరకు గుణపాఠముంది.

### الآية 79:27

> ﻿أَأَنْتُمْ أَشَدُّ خَلْقًا أَمِ السَّمَاءُ ۚ بَنَاهَا [79:27]

ఏమీ? మిమ్మల్ని సృష్టించడం కఠినమయిన పనా? లేక ఆకాశాన్నా? ఆయనే కదా దానిని నిర్మించింది!

### الآية 79:28

> ﻿رَفَعَ سَمْكَهَا فَسَوَّاهَا [79:28]

ఆయన దాని కప్పు (ఎత్తు)ను చాలా పైకి లేపాడు. తరువాత దానిని క్రమపరిచాడు;

### الآية 79:29

> ﻿وَأَغْطَشَ لَيْلَهَا وَأَخْرَجَ ضُحَاهَا [79:29]

మరియు ఆయన దాని రాత్రిని చీకటిగా చేశాడు. మరియు దాని పగటిని (వెలుగును) బహిర్గతం చేశాడు.

### الآية 79:30

> ﻿وَالْأَرْضَ بَعْدَ ذَٰلِكَ دَحَاهَا [79:30]

మరియు ఆ పిదప భూమిని పరచినట్లు చేశాడు.

### الآية 79:31

> ﻿أَخْرَجَ مِنْهَا مَاءَهَا وَمَرْعَاهَا [79:31]

దాని నుండి దాని నీళ్ళను మరియు దాని పచ్చికను బయటికి తీశాడు;

### الآية 79:32

> ﻿وَالْجِبَالَ أَرْسَاهَا [79:32]

మరియు పర్వతాలను (దానిలో) స్థిరంగా నాటాడు;

### الآية 79:33

> ﻿مَتَاعًا لَكُمْ وَلِأَنْعَامِكُمْ [79:33]

మీకు మరియు మీ పశువులకు జీవన సామగ్రిగా!

### الآية 79:34

> ﻿فَإِذَا جَاءَتِ الطَّامَّةُ الْكُبْرَىٰ [79:34]

ఇక ఆ గొప్ప దుర్ఘటన (పునరుత్థాన దినం) వచ్చినప్పుడు;

### الآية 79:35

> ﻿يَوْمَ يَتَذَكَّرُ الْإِنْسَانُ مَا سَعَىٰ [79:35]

ఆ రోజు మానవుడు తాను చేసిందంతా జ్ఞాపకం చేసుకుంటాడు;

### الآية 79:36

> ﻿وَبُرِّزَتِ الْجَحِيمُ لِمَنْ يَرَىٰ [79:36]

మరియు చూసే వారి యెదుటకు, నరకాగ్ని స్పష్టంగా కనబడేటట్లు తేబడుతుంది.

### الآية 79:37

> ﻿فَأَمَّا مَنْ طَغَىٰ [79:37]

ఇక ధిక్కారంతో హద్దులు మీరి ప్రవర్తించిన వాడికి;

### الآية 79:38

> ﻿وَآثَرَ الْحَيَاةَ الدُّنْيَا [79:38]

మరియు ఐహిక జీవితానికి ప్రాధాన్యత నిచ్చిన వాడికి;

### الآية 79:39

> ﻿فَإِنَّ الْجَحِيمَ هِيَ الْمَأْوَىٰ [79:39]

నిశ్చయంగా, నరకాగ్నియే, వాని నివాస స్థానమవుతుంది!

### الآية 79:40

> ﻿وَأَمَّا مَنْ خَافَ مَقَامَ رَبِّهِ وَنَهَى النَّفْسَ عَنِ الْهَوَىٰ [79:40]

మరియు తన ప్రభువు ముందు నిలబడ వలసి వుంటుందన్న భయంతో తన మనస్సును దుష్టవాంఛలకు దూరంగా ఉంచిన వ్యక్తికి;

### الآية 79:41

> ﻿فَإِنَّ الْجَنَّةَ هِيَ الْمَأْوَىٰ [79:41]

నిశ్చయంగా, స్వర్గమే, అతని నివాస స్థానమవుతుంది!

### الآية 79:42

> ﻿يَسْأَلُونَكَ عَنِ السَّاعَةِ أَيَّانَ مُرْسَاهَا [79:42]

(ఓ ముహమ్మద్!) వీరు నిన్ను - ఆ ఘడియను గురించి: "అసలు అది ఎప్పుడొస్తుంది?" అని అడుగుతున్నారు.

### الآية 79:43

> ﻿فِيمَ أَنْتَ مِنْ ذِكْرَاهَا [79:43]

దాని గురించి చెప్పడానికి దాంతో నీకేమి సంబంధం?

### الآية 79:44

> ﻿إِلَىٰ رَبِّكَ مُنْتَهَاهَا [79:44]

దాని వాస్తవ జ్ఞానం నీ ప్రభువుకే ఉంది!

### الآية 79:45

> ﻿إِنَّمَا أَنْتَ مُنْذِرُ مَنْ يَخْشَاهَا [79:45]

(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, నీవు, దానికి భయపడే వారిని హెచ్చరించే వాడవు మాత్రమే!

### الآية 79:46

> ﻿كَأَنَّهُمْ يَوْمَ يَرَوْنَهَا لَمْ يَلْبَثُوا إِلَّا عَشِيَّةً أَوْ ضُحَاهَا [79:46]

వారు దానిని చూసిన రోజు (తాము ప్రపంచంలో) కేవలం ఒక సాయంత్రమో లేక ఒక ఉదయమో గడిపినట్లు భావిస్తారు.

## روابط ذات صلة

- [النص القرآني للسورة](https://quranpedia.net/surah/1/79.md)
- [كل تفاسير سورة النازعات
](https://quranpedia.net/surah-tafsir/79.md)
- [ترجمات سورة النازعات
](https://quranpedia.net/translations/79.md)
- [صفحة الكتاب: الترجمة التلجوية](https://quranpedia.net/book/1990.md)
- [المؤلف: مولانا عبد الرحيم بن محمد](https://quranpedia.net/person/1765.md)

---

زُر [Quranpedia.net](https://quranpedia.net/surah/1/79/book/1990) — موسوعة القرآن الكريم: التفاسير، الترجمات، التلاوات، والمواضيع.
