వారితో అను: "అల్లాహ్ కు విధేయులై ఉండండి మరియు సందేశహరుణ్ణి అనుసరించండి. కాని ఒకవేళ మీరు మరలిపోతే, అతనిపై (ప్రవక్తపై) విధించబడినదాని బాధ్యత అతనిది; మరియు మీపై విధించబడినదాని బాధ్యత మీది. మీరు అతనిని (ప్రవక్తను) అనుసరిస్తే మార్గదర్శకత్వం పొందుతారు. మరియు సందేశహరుని బాధ్యత కేవలం స్పష్టంగా సందేశాన్ని అందజేయటం మాత్రమే."