కాని, మీరు ఎవరితోనైతే ఒడంబడిక చేసుకొని ఉన్నారో, అలాంటి వారితో కలసి పోయిన వారు గానీ, లేదా ఎవరైతే తమ హృదయాలలో మీతో గానీ, లేక తమ జాతి వారితో గానీ యుద్ధం చేయటానికి సంకట పడుతూ మీ వద్దకు వస్తారో అలాంటి వారిని గానీ, (మీరు వధించకండి). మరియు ఒకవేళ అల్లాహ్ కోరితే వారికి మీపై ఆధిక్యత ఇచ్చి ఉండేవాడు మరియు వారు మీతో యుద్ధం చేసి ఉండేవారు. కావున వారు మీ నుండి మరలిపోతే, మీతో యుద్ధం చేయక, మీతో సంధి చేసుకోవటానికి అంగీకరిస్తే (వారిపై దాడి చేయటానికి) అల్లాహ్ మీకు దారి చూపలేదు.