సముద్ర జంతువులను వేటాడటం మరియు వాటిని తినటం, జీవనోపాధిగా మీకూ (స్థిరనివాసులకూ) మరియు ప్రయాణీకులకూ ధర్మసమ్మతం చేయబడింది. కానీ, మీరు ఇహ్రామ్ స్థితిలో ఉన్నంత వరకూ భూమిపై వేటాడటం మీకు నిషేధింపబడింది. కావున మీరు (పునరుత్థాన దినమున) ఎవరి ముందు అయితే సమావేశ పరచ బడతారో ఆ అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి.