Surah Al-Mursalat in తెలుగు
سورة المرسلات · Verses: 50 · Meccan
Translation: తెలుగు translation (الترجمة التلجوية)
-
1
وَٱلۡمُرۡسَلَٰتِ عُرۡفࣰا
ఒకదాని తరువాత ఒకటి, వరుసగా పంపబడే వాయువుల సాక్షిగా! -
2
فَٱلۡعَٰصِفَٰتِ عَصۡفࣰا
మరియు తీవ్రమైన వేగతో వీచే వాయువుల సాక్షిగా! -
3
وَٱلنَّٰشِرَٰتِ نَشۡرࣰا
మరియు మేఘాలను దూరదూరంగా వ్యాపింపజేసే వాయువుల సాక్షిగా! -
4
فَٱلۡفَٰرِقَٰتِ فَرۡقࣰا
మరియు మంచి చెడులను విశదపరచే (దైవదూతల) సాక్షిగా! -
5
فَٱلۡمُلۡقِيَٰتِ ذِكۡرًا
సందేశాలను ప్రవక్తల వద్దకు తెచ్చే (దైవదూత) సాక్షిగా! -
6
عُذۡرًا أَوۡ نُذۡرًا
సాకుగా లేక హెచ్చరికగా! -
7
إِنَّمَا تُوعَدُونَ لَوَٰقِعࣱ
నిశ్చయంగా, మీకు వాగ్దానం చేయబడినది, జరగవలసి ఉంది. -
8
فَإِذَا ٱلنُّجُومُ طُمِسَتۡ
అప్పుడు ఎప్పడైతే నక్షత్రాలు కాంతి హీనమై పోతాయో! -
9
وَإِذَا ٱلسَّمَآءُ فُرِجَتۡ
మరియు ఆకాశం చీలిపోతుందో! -
10
وَإِذَا ٱلۡجِبَالُ نُسِفَتۡ
మరియు పర్వతాలు పొడిగా మారి, చెల్లాచెదురుగా చేయబడతాయో! -
11
وَإِذَا ٱلرُّسُلُ أُقِّتَتۡ
మరియు ప్రవక్తలు తమ నిర్ణీత సమయంలో సమావేశపరచబడతారో! -
12
لِأَيِّ يَوۡمٍ أُجِّلَتۡ
ఏ దినానికి గాను, (ఇవన్నీ) వాయిదా వేయబడ్డాయి? -
13
لِيَوۡمِ ٱلۡفَصۡلِ
ఆ తీర్పుదినం కొరకా! -
14
وَمَآ أَدۡرَىٰكَ مَا يَوۡمُ ٱلۡفَصۡلِ
మరియు ఆ తీర్పుదినం అంటే ఏమిటో నీకెలా అర్థం కాగలదు? -
15
وَيۡلࣱ يَوۡمَئِذࣲ لِّلۡمُكَذِّبِينَ
ఆ రోజు (పునరుత్థాన దినాన్ని) తిరస్కరించే వారికి వినాశమంది! -
16
أَلَمۡ نُهۡلِكِ ٱلۡأَوَّلِينَ
ఏమీ? మేము పూర్వీకులను నాశనం చేయలేదా? -
17
ثُمَّ نُتۡبِعُهُمُ ٱلۡأٓخِرِينَ
తరువాత రాబోయే వారిని కూడా, మేము వారి వెనక పంపుతాము. -
18
كَذَٰلِكَ نَفۡعَلُ بِٱلۡمُجۡرِمِينَ
ఈ విధంగా మేము నేరస్థుల పట్ల వ్యవహరిస్తాము. -
19
وَيۡلࣱ يَوۡمَئِذࣲ لِّلۡمُكَذِّبِينَ
ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది! -
20
أَلَمۡ نَخۡلُقكُّم مِّن مَّآءࣲ مَّهِينࣲ
ఏమీ? మేము మిమ్మల్ని తుచ్ఛమైన నీటితో (వీర్యబిందువుతో) సృష్టించలేదా? -
21
فَجَعَلۡنَٰهُ فِي قَرَارࣲ مَّكِينٍ
తరువాత మేము దానిని ఒక భద్రమైన స్థానంలో ఉంచాము. -
22
إِلَىٰ قَدَرࣲ مَّعۡلُومࣲ
ఒక నిర్ణీత కాలం వరకు. -
23
فَقَدَرۡنَا فَنِعۡمَ ٱلۡقَٰدِرُونَ
ఈ విధంగా మేము నిర్ణయించాము, ఎందుకంటే మేమే ఉత్తమమైన నిర్ణయాలు తీసుకునే వారము. -
24
وَيۡلࣱ يَوۡمَئِذࣲ لِّلۡمُكَذِّبِينَ
ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది! -
25
أَلَمۡ نَجۡعَلِ ٱلۡأَرۡضَ كِفَاتًا
ఏమీ? మేము భూమిని ఒక సమీకరించే స్థానంగా చేయలేదా? -
26
أَحۡيَآءࣰ وَأَمۡوَٰتࣰا
జీవులకూ మరియు మృతులకూను? -
27
وَجَعَلۡنَا فِيهَا رَوَٰسِيَ شَٰمِخَٰتࣲ وَأَسۡقَيۡنَٰكُم مَّآءࣰ فُرَاتࣰا
మరియు దానిలో ఎత్తైన పర్వతాలను స్థిరంగా నిలుపలేదా? మరియు మీకు త్రాగటానికి మంచి నీటిని ప్రసాదించలేదా? -
28
وَيۡلࣱ يَوۡمَئِذࣲ لِّلۡمُكَذِّبِينَ
ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది! -
29
ٱنطَلِقُوٓاْ إِلَىٰ مَا كُنتُم بِهِۦ تُكَذِّبُونَ
(సత్యతిరస్కారులతో ఇలా అనబడుతుంది): "మీరు తిరస్కరిస్తూ వచ్చిన దాని వైపునకు పొండి!" -
30
ٱنطَلِقُوٓاْ إِلَىٰ ظِلࣲّ ذِي ثَلَٰثِ شُعَبࣲ
(దాని పొగ) మూడు శాఖలుగా చీలిపోయే నీడ వైపునకు పొండి; -
31
لَّا ظَلِيلࣲ وَلَا يُغۡنِي مِنَ ٱللَّهَبِ
కాని అది ఏ విధమైన (చల్ల) నీడనూ ఇవ్వదూ మరియు (నరక) జ్వాలల నుండి కూడా కాపాడదు! -
32
إِنَّهَا تَرۡمِي بِشَرَرࣲ كَٱلۡقَصۡرِ
వాస్తవానికి అది పెద్ద పెద్ద మొద్దు వంటి అగ్నికణాలను విసురుతుంది. -
33
كَأَنَّهُۥ جِمَٰلَتࣱ صُفۡرࣱ
వాస్తవానికి ఆ అగ్నికణాలు పసుపు పచ్చని ఒంటెల వలే కనిపిస్తాయి. -
34
وَيۡلࣱ يَوۡمَئِذࣲ لِّلۡمُكَذِّبِينَ
ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది! -
35
هَٰذَا يَوۡمُ لَا يَنطِقُونَ
ఆ దినాన వారు మాట్లాడలేరు. -
36
وَلَا يُؤۡذَنُ لَهُمۡ فَيَعۡتَذِرُونَ
మరియు వారికి సాకులు చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వబడదు. -
37
وَيۡلࣱ يَوۡمَئِذࣲ لِّلۡمُكَذِّبِينَ
ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది! -
38
هَٰذَا يَوۡمُ ٱلۡفَصۡلِۖ جَمَعۡنَٰكُمۡ وَٱلۡأَوَّلِينَ
అది తీర్పుదినమై ఉంటుంది! మేము మిమ్మల్ని మరియు మీ పూర్వీకులను సమావేశపరచి ఉంటాము! -
39
فَإِن كَانَ لَكُمۡ كَيۡدࣱ فَكِيدُونِ
కావున మీ వద్ద ఏదైనా పన్నాగముంటే దానిని పన్నండి. -
40
وَيۡلࣱ يَوۡمَئِذࣲ لِّلۡمُكَذِّبِينَ
ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది! -
41
إِنَّ ٱلۡمُتَّقِينَ فِي ظِلَٰلࣲ وَعُيُونࣲ
నిశ్చయంగా భయభక్తులు గలవారు (ఆ రోజు చల్లని) నీడలలో చెలమల దగ్గర ఉంటారు. -
42
وَفَوَٰكِهَ مِمَّا يَشۡتَهُونَ
మరియు వారికి వారు కోరే ఫలాలు లభిస్తాయి. -
43
كُلُواْ وَٱشۡرَبُواْ هَنِيٓـَٔۢا بِمَا كُنتُمۡ تَعۡمَلُونَ
(వారితో ఇలా అనబడుతుంది): "మీరు చేస్తూ ఉండిన కర్మలను ఫలితంగా హాయిగా తినండి, త్రాగండి!" -
44
إِنَّا كَذَٰلِكَ نَجۡزِي ٱلۡمُحۡسِنِينَ
నిశ్చయంగా, మేము సజ్జనులకు ఇలాంటి ప్రతిఫలమే ఇస్తాము. -
45
وَيۡلࣱ يَوۡمَئِذࣲ لِّلۡمُكَذِّبِينَ
ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది! -
46
كُلُواْ وَتَمَتَّعُواْ قَلِيلًا إِنَّكُم مُّجۡرِمُونَ
(ఓ సత్యతిరస్కారులారా!) మీరు కొంతకాలం తినండి, సుఖాలు అనుభవించండి. నిశ్చయంగా, మీరు నేరస్థులు! -
47
وَيۡلࣱ يَوۡمَئِذࣲ لِّلۡمُكَذِّبِينَ
ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది! -
48
وَإِذَا قِيلَ لَهُمُ ٱرۡكَعُواْ لَا يَرۡكَعُونَ
మరియు వారితో: "(అల్లాహ్ ముందు) వంగండి (రుకూఉ చేయండి)." అని అన్నప్పుడు, వారు వంగలేదు. -
49
وَيۡلࣱ يَوۡمَئِذࣲ لِّلۡمُكَذِّبِينَ
ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది! -
50
فَبِأَيِّ حَدِيثِۭ بَعۡدَهُۥ يُؤۡمِنُونَ
దీని (ఈ ఖుర్ఆన్) తరువాత ఇక వారు మరెలాంటి సందేశాన్నివిశ్వసిస్తారు?