Surah Al-Inshiqaq in తెలుగు
سورة الإنشقاق · Verses: 25 · Meccan
Translation: తెలుగు translation (الترجمة التلجوية)
-
1
إِذَا ٱلسَّمَآءُ ٱنشَقَّتۡ
ఆకాశం బ్రద్దలయి పోయినప్పుడు! -
2
وَأَذِنَتۡ لِرَبِّهَا وَحُقَّتۡ
మరియు అది తన ప్రభువు ఆదేశపాలన చేసింది మరియు అదే దాని విధ్యుక్త ధర్మం. -
3
وَإِذَا ٱلۡأَرۡضُ مُدَّتۡ
మరియు భూమి విస్తరింపజేయబడి (చదునుగా చేయబడి) నప్పుడు; -
4
وَأَلۡقَتۡ مَا فِيهَا وَتَخَلَّتۡ
మరియు అది తన లోపల ఉన్నదంతా బయటికి విసరివేసి, ఖాళీ అయినప్పుడు; -
5
وَأَذِنَتۡ لِرَبِّهَا وَحُقَّتۡ
అది తన ప్రభువు ఆదేశపాలన చేసింది మరియు అదే దాని విధ్యుక్త ధర్మం. -
6
يَٰٓأَيُّهَا ٱلۡإِنسَٰنُ إِنَّكَ كَادِحٌ إِلَىٰ رَبِّكَ كَدۡحࣰا فَمُلَٰقِيهِ
ఓ మానవుడా! నిశ్చయంగా, నీవు నీ ప్రభువు వైపునకు, నీ (మంచి-చెడు) కర్మలను తీసుకొని మరలుతున్నావు, ఒక నిశ్చిత మరల్పు. అప్పుడు నీవు నీ (కర్మల ఫలితాన్ని) పొందుతావు. -
7
فَأَمَّا مَنۡ أُوتِيَ كِتَٰبَهُۥ بِيَمِينِهِۦ
అప్పుడు తన కర్మపత్రం కుడిచేతిలో ఇవ్వబడినవాడి నుండి; -
8
فَسَوۡفَ يُحَاسَبُ حِسَابࣰا يَسِيرࣰا
అతని లెక్క అతి తేలికగా తీసుకోబడగలదు. -
9
وَيَنقَلِبُ إِلَىٰٓ أَهۡلِهِۦ مَسۡرُورࣰا
మరియు అతడు సంతోషంగా తన వారి దగ్గరకు మరలిపోతాడు! -
10
وَأَمَّا مَنۡ أُوتِيَ كِتَٰبَهُۥ وَرَآءَ ظَهۡرِهِۦ
ఇక తన కర్మపత్రం వీపు వెనుక నుండి ఇవ్వబడినవాడు; -
11
فَسَوۡفَ يَدۡعُواْ ثُبُورࣰا
అప్పుడతడు తన నాశనాన్నే - కోరుకుంటాడు; -
12
وَيَصۡلَىٰ سَعِيرًا
మరియు అతడు మండుతున్న నరకాగ్నిలో పడిపోతాడు. -
13
إِنَّهُۥ كَانَ فِيٓ أَهۡلِهِۦ مَسۡرُورًا
వాస్తవానికి, అతడు (ప్రపంచంలో) తన వారి మధ్య సుఖసంతోషాలలో మునిగి ఉండేవాడు. -
14
إِنَّهُۥ ظَنَّ أَن لَّن يَحُورَ
వాస్తవానికి, అతడు (మా వైపుకు) మరలిరాడని భావించేవాడు. -
15
بَلَىٰٓۚ إِنَّ رَبَّهُۥ كَانَ بِهِۦ بَصِيرࣰا
అలా కాదు! వాస్తవానికి, అతని ప్రభువు అతనిని గమనిస్తూ ఉండేవాడు. -
16
فَلَآ أُقۡسِمُ بِٱلشَّفَقِ
కనుక, నేను సంధ్యకాలపు ఎరుపు సాక్షిగా చెబుతున్నాను! -
17
وَٱلَّيۡلِ وَمَا وَسَقَ
రాత్రి సాక్షిగా, అది ప్రోగు చేసేవాటి సాక్షిగా! -
18
وَٱلۡقَمَرِ إِذَا ٱتَّسَقَ
పూర్ణచంద్రుని సాక్షిగా! -
19
لَتَرۡكَبُنَّ طَبَقًا عَن طَبَقࣲ
మీరందరూ తప్పనిసరిగా ఒక స్థితి నుండి మరొక స్థితికి క్రమక్రమంగా మారుతూ పోవలసి ఉంటుంది. -
20
فَمَا لَهُمۡ لَا يُؤۡمِنُونَ
అయితే వీరి కేమయింది? వీరు ఎందుకు విశ్వసించరు? -
21
وَإِذَا قُرِئَ عَلَيۡهِمُ ٱلۡقُرۡءَانُ لَا يَسۡجُدُونَۤ۩
మరియు ఖుర్ఆన్ వీరి ముందు పఠింపబడినప్పుడు వీరెందుకు సాష్టాంగం (సజ్దా) చేయరు? -
22
بَلِ ٱلَّذِينَ كَفَرُواْ يُكَذِّبُونَ
అలా కాదు! ఈ సత్యతిరస్కారులు దీనిని అసత్యమంటున్నారు. -
23
وَٱللَّهُ أَعۡلَمُ بِمَا يُوعُونَ
మరియు వారు కూడబెట్టేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు. -
24
فَبَشِّرۡهُم بِعَذَابٍ أَلِيمٍ
కాబట్టి వారికి (పరలోకంలో) లభించే వ్యధాభరితమైన శిక్ష యొక్క వార్తనివ్వు - -
25
إِلَّا ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ لَهُمۡ أَجۡرٌ غَيۡرُ مَمۡنُونِۭ
విశ్వసించి సత్కార్యాలు చేసే వారికి తప్ప - వారికి ఎన్నటికీ అంతం గాని ప్రతిఫలం ఉంటుంది.