Surah Al-Buruj in తెలుగు
سورة البروج · Verses: 22 · Meccan
Translation: తెలుగు translation (الترجمة التلجوية)
-
1
وَٱلسَّمَآءِ ذَاتِ ٱلۡبُرُوجِ
విస్తారమైన తారాగణం గల ఆకాశం సాక్షిగా! -
2
وَٱلۡيَوۡمِ ٱلۡمَوۡعُودِ
వాగ్దానం చేయబడిన (పునరుత్థాన) దినం సాక్షిగా! -
3
وَشَاهِدࣲ وَمَشۡهُودࣲ
చూచేదాని (దినం) మరియు చూడబడే దాని (దినం) సాక్షిగా! -
4
قُتِلَ أَصۡحَٰبُ ٱلۡأُخۡدُودِ
అగ్ని కందకం (ఉఖూద్) వారు నాశనం చేయబడ్డారు. -
5
ٱلنَّارِ ذَاتِ ٱلۡوَقُودِ
ఇంధనంతో తీవ్రంగా మండే అగ్నిని రాజేసేవారు. -
6
إِذۡ هُمۡ عَلَيۡهَا قُعُودࣱ
వారు దాని (ఆ కందకం) అంచుపై కూర్చొని ఉన్నప్పుడు; -
7
وَهُمۡ عَلَىٰ مَا يَفۡعَلُونَ بِٱلۡمُؤۡمِنِينَ شُهُودࣱ
మరియు తాము విశ్వాసుల పట్ల చేసే ఘోర కార్యాలను (సజీవ దహనాలను) తిలకించేవారు. -
8
وَمَا نَقَمُواْ مِنۡهُمۡ إِلَّآ أَن يُؤۡمِنُواْ بِٱللَّهِ ٱلۡعَزِيزِ ٱلۡحَمِيدِ
మరియు వారు విశ్వాసుల పట్ల కసి పెంచుకోవడానికి కారణం - వారు (విశ్వాసులు) సర్వశక్తిమంతుడు, సర్వ స్తోత్రాలకు అర్హుడైన - అల్లాహ్ ను విశ్వసించడం మాత్రమే! -
9
ٱلَّذِي لَهُۥ مُلۡكُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۚ وَٱللَّهُ عَلَىٰ كُلِّ شَيۡءࣲ شَهِيدٌ
ఆయనే! ఎవరికైతే భూమ్యాకాశాల ఆధిపత్యం ఉందో! మరియు అల్లాహ్ యే ప్రతిదానికి సాక్షి. -
10
إِنَّ ٱلَّذِينَ فَتَنُواْ ٱلۡمُؤۡمِنِينَ وَٱلۡمُؤۡمِنَٰتِ ثُمَّ لَمۡ يَتُوبُواْ فَلَهُمۡ عَذَابُ جَهَنَّمَ وَلَهُمۡ عَذَابُ ٱلۡحَرِيقِ
ఎవరైతే విశ్వాసులైన పురుషులను మరియు విశ్వాసులైన స్త్రీలను హింసిస్తారో, ఆ తరువాత పశ్చాత్తాపంతో క్షమాపణ కోరరో! నిశ్చయంగా, అలాంటి వారికి నరకశిక్ష ఉంటుంది. మరియు వారికి మండే నరకాగ్ని శిక్ష విధించబడుతుంది. -
11
إِنَّ ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ لَهُمۡ جَنَّٰتࣱ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُۚ ذَٰلِكَ ٱلۡفَوۡزُ ٱلۡكَبِيرُ
నిశ్చయంగా, విశ్వసించి సత్కార్యాలు చేసేవారి కొరకు క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలుంటాయి. అదే గొప్ప విజయం. -
12
إِنَّ بَطۡشَ رَبِّكَ لَشَدِيدٌ
నిశ్చయంగా, నీ ప్రభువు యొక్క పట్టు (శిక్ష) చాలా కఠినమైనది. -
13
إِنَّهُۥ هُوَ يُبۡدِئُ وَيُعِيدُ
నిశ్చయంగా, ఆయనే (సృష్టిని) ఆరంభించేవాడు మరియు ఆయనే (దానిని) మరల ఉనికిలోకి తెచ్చేవాడు. -
14
وَهُوَ ٱلۡغَفُورُ ٱلۡوَدُودُ
మరియు ఆయన క్షమాశీలుడు, అమిత వాత్సల్యుడు. -
15
ذُو ٱلۡعَرۡشِ ٱلۡمَجِيدُ
సింహాసనాన్ని (అర్ష్ ను) అధిష్టించిన వాడు, మహత్త్వపూర్ణుడు. -
16
فَعَّالࣱ لِّمَا يُرِيدُ
తాను తలచింది చేయగలవాడు. -
17
هَلۡ أَتَىٰكَ حَدِيثُ ٱلۡجُنُودِ
ఏమీ? సైన్యాల వారి సమాచారం నీకు అందిందా? -
18
فِرۡعَوۡنَ وَثَمُودَ
ఫిర్ఔన్ మరియు సమూద్ వారి (సైన్యాల). -
19
بَلِ ٱلَّذِينَ كَفَرُواْ فِي تَكۡذِيبࣲ
అలా కాదు, సత్యతిరస్కారులు (సత్యాన్ని) తిరస్కరించుటలో నిమగ్నులై ఉన్నారు. -
20
وَٱللَّهُ مِن وَرَآئِهِم مُّحِيطُۢ
మరియు అల్లాహ్ వారిని వెనుక (ప్రతి దిక్కు) నుండి చుట్టుముట్టి ఉన్నాడు. -
21
بَلۡ هُوَ قُرۡءَانࣱ مَّجِيدࣱ
వాస్తవానికి, ఇది ఒక దివ్యమైన ఖుర్ఆన్. -
22
فِي لَوۡحࣲ مَّحۡفُوظِۭ
సురక్షితమైన ఫలకం (లౌహె మహ్ ఫూజ్) లో (వ్రాయబడి) ఉన్నది.