Surah At-Tariq in తెలుగు
سورة الطارق · Verses: 17 · Meccan
Translation: తెలుగు translation (الترجمة التلجوية)
-
1
وَٱلسَّمَآءِ وَٱلطَّارِقِ
ఆకాశం మరియు రాత్రివేళ వచ్చే నక్షత్రం (అత్ తారిఖ్) సాక్షిగా! -
2
وَمَآ أَدۡرَىٰكَ مَا ٱلطَّارِقُ
రాత్రి వేళ వచ్చేది (అత్ తారిఖ్) అంటే ఏమిటో నీకు ఎలా తెలుస్తుంది? -
3
ٱلنَّجۡمُ ٱلثَّاقِبُ
అదొక అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం. -
4
إِن كُلُّ نَفۡسࣲ لَّمَّا عَلَيۡهَا حَافِظࣱ
కనిపెట్టుకొని ఉండేవాడు (దేవదూత) లేకుండా ఏ వ్యక్తి కూడా లేడు. -
5
فَلۡيَنظُرِ ٱلۡإِنسَٰنُ مِمَّ خُلِقَ
కావున మానవుడు తాను దేనితో సృష్టించబడ్డాడో గమనించాలి! -
6
خُلِقَ مِن مَّآءࣲ دَافِقࣲ
అతడు విసర్జించబడే (చిమ్ముకుంటూ వెలువడే) ద్రవపదార్థంతో సృష్టించబడ్డాడు. -
7
يَخۡرُجُ مِنۢ بَيۡنِ ٱلصُّلۡبِ وَٱلتَّرَآئِبِ
అది వెన్ను మరియు రొమ్ము ఎముకల మధ్యభాగం నుండి బయటికి వస్తుంది. -
8
إِنَّهُۥ عَلَىٰ رَجۡعِهِۦ لَقَادِرࣱ
నిశ్చయంగా, ఆయన (సృష్టికర్త), అతనిని మరల బ్రతికించి తేగల సామర్థ్యం గలవాడు! -
9
يَوۡمَ تُبۡلَى ٱلسَّرَآئِرُ
ఏ రోజయితే రహస్య విషయాల విచారణ జరుగుతుందో! -
10
فَمَا لَهُۥ مِن قُوَّةࣲ وَلَا نَاصِرࣲ
అప్పుడు అతనికి (మానవునికి) ఎలాంటి శక్తి ఉండదు మరియు ఏ సహాయకుడునూ ఉండడు. -
11
وَٱلسَّمَآءِ ذَاتِ ٱلرَّجۡعِ
వర్షం కురిపించే ఆకాశం సాక్షిగా! -
12
وَٱلۡأَرۡضِ ذَاتِ ٱلصَّدۡعِ
(చెట్లు మొలకెత్తేటప్పుడు) చీలి పోయే భూమి సాక్షిగా! -
13
إِنَّهُۥ لَقَوۡلࣱ فَصۡلࣱ
నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్, సత్యాసత్యాలను) వేరు పరచే వాక్కు (గీటురాయి). -
14
وَمَا هُوَ بِٱلۡهَزۡلِ
మరియు ఇది వృథా కాలక్షేపానికి వచ్చినది కాదు. -
15
إِنَّهُمۡ يَكِيدُونَ كَيۡدࣰا
(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, వారు (నీకు విరుద్ధంగా) కుట్రపన్నుతున్నారు. -
16
وَأَكِيدُ كَيۡدࣰا
మరియు నేను కూడా పన్నాగం పన్నుతున్నాను. -
17
فَمَهِّلِ ٱلۡكَٰفِرِينَ أَمۡهِلۡهُمۡ رُوَيۡدَۢا
కనుక నీవు సత్యతిరస్కారులకు కొంత వ్యవధి నివ్వు! వారి పట్ల మృదువుగా వ్యవహరించు.