Surah Al-A'la in తెలుగు
سورة الأعلى · Verses: 19 · Meccan
Translation: తెలుగు translation (الترجمة التلجوية)
-
1
سَبِّحِ ٱسۡمَ رَبِّكَ ٱلۡأَعۡلَى
అత్యున్నతుడైన నీ ప్రభువు నామాన్ని స్తుతించు! -
2
ٱلَّذِي خَلَقَ فَسَوَّىٰ
ఆయనే (ప్రతిదానిని) సృష్టించాడు మరియు తగిన ప్రమాణంలో రూపొందించాడు. -
3
وَٱلَّذِي قَدَّرَ فَهَدَىٰ
మరియు ఆయనే దాని ప్రకృతి లక్షణాలను నిర్ణయించాడు, మరియు మార్గం చూపాడు! -
4
وَٱلَّذِيٓ أَخۡرَجَ ٱلۡمَرۡعَىٰ
మరియు ఆయనే పచ్చికను మొలిపింప జేశాడు. -
5
فَجَعَلَهُۥ غُثَآءً أَحۡوَىٰ
మరల దానిని నల్లని చెత్తాచెదారంగా చేశాడు. -
6
سَنُقۡرِئُكَ فَلَا تَنسَىٰٓ
మేము నీచేత (ఖుర్ఆన్ ను) చదివింప జేస్తాము, తరువాత నీవు (దానిని) మరచిపోవు - -
7
إِلَّا مَا شَآءَ ٱللَّهُۚ إِنَّهُۥ يَعۡلَمُ ٱلۡجَهۡرَ وَمَا يَخۡفَىٰ
అల్లాహ్ కోరింది తప్ప! నిశ్చయంగా, బహిరంగంగా ఉన్నదీ మరియు గోప్యంగా ఉన్నదీ అన్నీ ఆయనకు బాగా తెలుసు. -
8
وَنُيَسِّرُكَ لِلۡيُسۡرَىٰ
మరియు మేము నీ మార్గాన్ని సులభం చేయడానికి నీకు సౌలభ్యాన్ని కలుగజేస్తాము. -
9
فَذَكِّرۡ إِن نَّفَعَتِ ٱلذِّكۡرَىٰ
కావున నీవు హితోపదేశం చేస్తూ ఉండు; వారికి హితోపదేశం లాభదాయకం కావచ్చు! -
10
سَيَذَّكَّرُ مَن يَخۡشَىٰ
(అల్లాహ్ కు) భయపడే వాడు హితోపదేశాన్ని స్వీకరిస్తాడు. -
11
وَيَتَجَنَّبُهَا ٱلۡأَشۡقَى
మరియు దౌర్భాగ్యుడు దానికి దూరమై పోతాడు. -
12
ٱلَّذِي يَصۡلَى ٱلنَّارَ ٱلۡكُبۡرَىٰ
అలాంటి వాడే ఘోరమైన నరకాగ్నిలో పడి కాలుతాడు. -
13
ثُمَّ لَا يَمُوتُ فِيهَا وَلَا يَحۡيَىٰ
అప్పుడు, అతడు అందులో చావనూ లేడు, బ్రతకనూ లేడు. -
14
قَدۡ أَفۡلَحَ مَن تَزَكَّىٰ
సుశీలతను (పవిత్రతను) పాటించే వాడు తప్పక సాఫల్యం పొందుతాడు. -
15
وَذَكَرَ ٱسۡمَ رَبِّهِۦ فَصَلَّىٰ
మరియు తన ప్రభువు నామాన్ని స్మరిస్తూ, నమాజ్ చేస్తూ ఉండేవాడు. -
16
بَلۡ تُؤۡثِرُونَ ٱلۡحَيَوٰةَ ٱلدُّنۡيَا
అలా కాదు! మీరు ఐహిక జీవితానికి ప్రాధాన్యత నిస్తున్నారు; -
17
وَٱلۡأٓخِرَةُ خَيۡرࣱ وَأَبۡقَىٰٓ
కాని పరలోక జీవితమే మేలైనది మరియు చిరకాలముండేది. -
18
إِنَّ هَٰذَا لَفِي ٱلصُّحُفِ ٱلۡأُولَىٰ
నిశ్చయంగా, ఈ విషయం పూర్వగ్రంథాలలో (వ్రాయబడి) ఉంది; -
19
صُحُفِ إِبۡرَٰهِيمَ وَمُوسَىٰ
ఇబ్రాహీమ్ మరియు మూసాలపై (అవతరింపజేయబడిన) గ్రంథాలలో.