Surah Al-Fajr in తెలుగు
سورة الفجر · Verses: 30 · Meccan
Translation: తెలుగు translation (الترجمة التلجوية)
-
1
وَٱلۡفَجۡرِ
ప్రాంతః కాలం సాక్షిగా! -
2
وَلَيَالٍ عَشۡرࣲ
పది రాత్రుల సాక్షిగా! -
3
وَٱلشَّفۡعِ وَٱلۡوَتۡرِ
సరి బేసీల సాక్షిగా! -
4
وَٱلَّيۡلِ إِذَا يَسۡرِ
గడచిపోయే రాత్రి సాక్షిగా! -
5
هَلۡ فِي ذَٰلِكَ قَسَمࣱ لِّذِي حِجۡرٍ
వీటిలో బుద్ధిగల వాని కొరకు ఏ ప్రమాణమూ లేదా ఏమిటి? -
6
أَلَمۡ تَرَ كَيۡفَ فَعَلَ رَبُّكَ بِعَادٍ
నీ ప్రభువు ఆద్ (జాతి) వారి పట్ల ఎలా వ్యవహరించాడో నీకు తెలియదా? -
7
إِرَمَ ذَاتِ ٱلۡعِمَادِ
ఎత్తైన స్థంభాల (భవనాలు గల) ఇరమ్ ప్రజల పట్ల? -
8
ٱلَّتِي لَمۡ يُخۡلَقۡ مِثۡلُهَا فِي ٱلۡبِلَٰدِ
వారిలాంటి జాతి భూమిలో ఎన్నడూ సృష్టించబడలేదు. -
9
وَثَمُودَ ٱلَّذِينَ جَابُواْ ٱلصَّخۡرَ بِٱلۡوَادِ
మరియు లోయలలోని కొండరాళ్ళలో (భవనాలను) తొలిచిన సమూద్ జాతి పట్ల? -
10
وَفِرۡعَوۡنَ ذِي ٱلۡأَوۡتَادِ
మరియు మేకులవాడైన ఫిర్ఔన్ పట్ల? -
11
ٱلَّذِينَ طَغَوۡاْ فِي ٱلۡبِلَٰدِ
వారంతా ఆయా దేశాలలో తలబిరుసుతనంతో ప్రవర్తించారు; -
12
فَأَكۡثَرُواْ فِيهَا ٱلۡفَسَادَ
మరియు వాటిలో దౌర్జన్యాన్ని రేకెత్తించారు. -
13
فَصَبَّ عَلَيۡهِمۡ رَبُّكَ سَوۡطَ عَذَابٍ
కాబట్టి నీ ప్రభువు వారిపైకి అనేక రకాల బాధాకరమైన శిక్షలను పంపాడు. -
14
إِنَّ رَبَّكَ لَبِٱلۡمِرۡصَادِ
వాస్తవానికి, నీ ప్రభువు మాటు వేసి ఉన్నాడు (అంతా కనిపెడ్తూ ఉంటాడు)! -
15
فَأَمَّا ٱلۡإِنسَٰنُ إِذَا مَا ٱبۡتَلَىٰهُ رَبُّهُۥ فَأَكۡرَمَهُۥ وَنَعَّمَهُۥ فَيَقُولُ رَبِّيٓ أَكۡرَمَنِ
అయితే మానవుడు ఎలాంటి వాడంటే: అతని ప్రభువు అతన్ని పరీక్షించటానికి, అతనికి గౌరవ ప్రతిష్టల నిచ్చి అనుగ్రహించి నప్పుడు: "నా ప్రభువు నన్ను గౌరవించాడు." అని అంటాడు; -
16
وَأَمَّآ إِذَا مَا ٱبۡتَلَىٰهُ فَقَدَرَ عَلَيۡهِ رِزۡقَهُۥ فَيَقُولُ رَبِّيٓ أَهَٰنَنِ
కాని, అతన్ని పరీక్షించటానికి, అతని ఉపాధిని తగ్గించినప్పుడు: "నా ప్రభువు నన్ను అవమానించాడు." అని అంటాడు. -
17
كَلَّاۖ بَل لَّا تُكۡرِمُونَ ٱلۡيَتِيمَ
అలా కాదు, వాస్తవానికి మీరు అనాథులను ఆదరించరు; -
18
وَلَا تَحَٰٓضُّونَ عَلَىٰ طَعَامِ ٱلۡمِسۡكِينِ
మరియు మీరు పేదలకు అన్నం పెట్టే విషయంలో ఒకరినొకరు ప్రోత్సహించుకోరు; -
19
وَتَأۡكُلُونَ ٱلتُّرَاثَ أَكۡلࣰا لَّمࣰّا
మరియు వారసత్వపు ఆస్తిని పేరాశతో అంతా మీరే తినేస్తారు. -
20
وَتُحِبُّونَ ٱلۡمَالَ حُبࣰّا جَمࣰّا
మరియు మీరు ధనవ్యామోహంలో దారుణంగా చిక్కుకు పోయారు! -
21
كَلَّآۖ إِذَا دُكَّتِ ٱلۡأَرۡضُ دَكࣰّا دَكࣰّا
అలా కాదు, భూమి, దంచి పిండిపిండిగా చేయబడినపుడు; -
22
وَجَآءَ رَبُّكَ وَٱلۡمَلَكُ صَفࣰّا صَفࣰّا
మరియు నీ ప్రభువు (స్వయంగా) వస్తాడు మరియు దేవదూతలు వరుసలలో వస్తారు. -
23
وَجِاْيٓءَ يَوۡمَئِذِۭ بِجَهَنَّمَۚ يَوۡمَئِذࣲ يَتَذَكَّرُ ٱلۡإِنسَٰنُ وَأَنَّىٰ لَهُ ٱلذِّكۡرَىٰ
ఆ రోజు నరకం (ముందుకు) తీసుకు రాబడుతుంది. ఆ రోజు మానవుడు (తన కర్మలన్నీ) జ్ఞప్తికి తెచ్చుకుంటాడు; కాని ఆ రోజు జ్ఞప్తికి తెచ్చుకోవడం వల్ల అతనికి కలిగే ప్రయోజనమేమిటీ? -
24
يَقُولُ يَٰلَيۡتَنِي قَدَّمۡتُ لِحَيَاتِي
అతడు: "అయ్యో! నా పాడుగానూ! నా ఈ జీవితం కొరకు నేను (సత్కార్యాలు) చేసి పంపు కొని ఉంటే ఎంత బాగుండేది!" అని వాపోతాడు. -
25
فَيَوۡمَئِذࣲ لَّا يُعَذِّبُ عَذَابَهُۥٓ أَحَدࣱ
అయితే, ఆ రోజు, ఆయన (అల్లాహ్) శిక్షించినట్లు, మరెవ్వడూ శిక్షించలేడు! -
26
وَلَا يُوثِقُ وَثَاقَهُۥٓ أَحَدࣱ
మరియు ఆయన (అల్లాహ్) బంధించినట్లు, మరెవ్వడూ బంధించలేడు. -
27
يَٰٓأَيَّتُهَا ٱلنَّفۡسُ ٱلۡمُطۡمَئِنَّةُ
(సన్మార్గునితో ఇలా అనబడుతుంది): "ఓ తృప్తి పొందిన ఆత్మా! -
28
ٱرۡجِعِيٓ إِلَىٰ رَبِّكِ رَاضِيَةࣰ مَّرۡضِيَّةࣰ
నీ ప్రభువు సన్నిధికి మరలి రా! (నీకు లభించే సత్ఫలితానికి) ఆనందిస్తూ మరియు (నీ ప్రభువునకు) ప్రియమైనదానివై! -
29
فَٱدۡخُلِي فِي عِبَٰدِي
నీవు (పుణ్యాత్ములైన) నా దాసులలో చేరిపో! -
30
وَٱدۡخُلِي جَنَّتِي
మరియు నీవు నా స్వర్గంలో ప్రవేశించు!"