Surah Al-Waqi'ah in తెలుగు
سورة الواقعة · Verses: 96 · Meccan
Translation: తెలుగు translation (الترجمة التلجوية)
-
1
إِذَا وَقَعَتِ ٱلۡوَاقِعَةُ
ఆ అనివార్య సంఘటన సంభవించినపుడు, -
2
لَيۡسَ لِوَقۡعَتِهَا كَاذِبَةٌ
అది సంభవించటంలో ఎలాంటి సందేహం (అసత్యం) లేదు. -
3
خَافِضَةࣱ رَّافِعَةٌ
అది కొందరిని హీనపరుస్తుంది, మరికొందరిని పైకెత్తుతుంది -
4
إِذَا رُجَّتِ ٱلۡأَرۡضُ رَجࣰّا
భూమి తీవ్ర కంపనంతో కంపించినపుడు; -
5
وَبُسَّتِ ٱلۡجِبَالُ بَسࣰّا
మరియు పర్వతాలు పొడిగా మార్చబడినపుడు; -
6
فَكَانَتۡ هَبَآءࣰ مُّنۢبَثࣰّا
అప్పుడు వాటి దుమ్ము నలువైపులా నిండి పోయినపుడు; -
7
وَكُنتُمۡ أَزۡوَٰجࣰا ثَلَٰثَةࣰ
మరియు మీరు మూడు వర్గాలుగా విభజింపబడతారు. -
8
فَأَصۡحَٰبُ ٱلۡمَيۡمَنَةِ مَآ أَصۡحَٰبُ ٱلۡمَيۡمَنَةِ
ఇక కుడిపక్షం వారు, ఆ కుడిపక్షము వారు ఎంత (అదృష్టవంతులు)! -
9
وَأَصۡحَٰبُ ٱلۡمَشۡـَٔمَةِ مَآ أَصۡحَٰبُ ٱلۡمَشۡـَٔمَةِ
మరికొందరు వామపక్షం వారుంటారు, ఆ వామపక్షపు వారు ఎంత (దౌర్భాగ్యులు)! -
10
وَٱلسَّٰبِقُونَ ٱلسَّٰبِقُونَ
మరియు (ఇహలోకంలో విశ్వాసంలో) ముందున్న వారు (స్వర్గంలో కూడా) ముందుంటారు. -
11
أُوْلَٰٓئِكَ ٱلۡمُقَرَّبُونَ
అలాంటి వారు (అల్లాహ్) సాన్నిధ్యాన్ని పొందుతారు. -
12
فِي جَنَّٰتِ ٱلنَّعِيمِ
వారు సర్వసుఖాలు గల స్వర్గవనాలలో ఉంటారు. -
13
ثُلَّةࣱ مِّنَ ٱلۡأَوَّلِينَ
మొదటి తరాల వారిలో నుండి చాలా మంది; -
14
وَقَلِيلࣱ مِّنَ ٱلۡأٓخِرِينَ
మరియు తరువాత తరాల వారిలో నుండి కొంతమంది. -
15
عَلَىٰ سُرُرࣲ مَّوۡضُونَةࣲ
(బంగారు) జలతారు అల్లిన ఆసనాల మీద; -
16
مُّتَّكِـِٔينَ عَلَيۡهَا مُتَقَٰبِلِينَ
ఒకరికొకరు ఎదురెదురుగా, వాటి మీద దిండ్లకు ఆనుకొని కూర్చొని ఉంటారు. -
17
يَطُوفُ عَلَيۡهِمۡ وِلۡدَٰنࣱ مُّخَلَّدُونَ
వారి చుట్టుప్రక్కలలో చిరంజీవులైన (నిత్యబాల్యం గల) బాలురు (సేవకులు) తిరుగుతూ ఉంటారు. -
18
بِأَكۡوَابࣲ وَأَبَارِيقَ وَكَأۡسࣲ مِّن مَّعِينࣲ
(మధువు) ప్రవహించే చెలమల నుండి నింపిన పాత్రలు, గిన్నెలు మరియు కప్పులతో! -
19
لَّا يُصَدَّعُونَ عَنۡهَا وَلَا يُنزِفُونَ
దాని వలన వారికి తలనొప్పి గానీ లేక మత్తు గానీ కలుగదు. -
20
وَفَٰكِهَةࣲ مِّمَّا يَتَخَيَّرُونَ
మరియు వారు కోరే పండ్లు, ఫలాలు ఉంటాయి. -
21
وَلَحۡمِ طَيۡرࣲ مِّمَّا يَشۡتَهُونَ
మరియు వారు ఇష్టపడే పక్షుల మాంసం. -
22
وَحُورٌ عِينࣱ
మరియు అందమైన కన్నులు గల సుందరాంగులు (హూరున్); -
23
كَأَمۡثَٰلِ ٱللُّؤۡلُوِٕ ٱلۡمَكۡنُونِ
దాచబడిన ముత్యాల వలే! -
24
جَزَآءَۢ بِمَا كَانُواْ يَعۡمَلُونَ
ఇదంతా వారు చేస్తూ ఉండిన వాటికి (సత్కార్యాలకు) ప్రతిఫలంగా! -
25
لَا يَسۡمَعُونَ فِيهَا لَغۡوࣰا وَلَا تَأۡثِيمًا
అందులో వారు వ్యర్థమైన మాటలు గానీ, పాప విషయాలు గానీ వినరు. -
26
إِلَّا قِيلࣰا سَلَٰمࣰا سَلَٰمࣰا
"శాంతి (సలాం) శాంతి (సలాం)!" అనే మాటలు తప్ప! -
27
وَأَصۡحَٰبُ ٱلۡيَمِينِ مَآ أَصۡحَٰبُ ٱلۡيَمِينِ
మరియు కుడి పక్షం వారు, ఆ కుడి పక్షం వారు ఎంత (అదృష్టవంతులు)! -
28
فِي سِدۡرࣲ مَّخۡضُودࣲ
వారు ముళ్ళు లేని సిదర్ వృక్షాల మధ్య ! -
29
وَطَلۡحࣲ مَّنضُودࣲ
మరియు పండ్ల గెలలతో నిండిన అరటి చెట్లు; -
30
وَظِلࣲّ مَّمۡدُودࣲ
మరియు వ్యాపించి ఉన్న నీడలు, -
31
وَمَآءࣲ مَّسۡكُوبࣲ
మరియు ఎల్లప్పుడు ప్రవహించే నీరు; -
32
وَفَٰكِهَةࣲ كَثِيرَةࣲ
మరియు సమృద్ధిగా ఉన్న పండ్లు, ఫలాలు; -
33
لَّا مَقۡطُوعَةࣲ وَلَا مَمۡنُوعَةࣲ
ఎడతెగకుండా మరియు అంతం కాకుండా (ఉండే వనాలలో); -
34
وَفُرُشࣲ مَّرۡفُوعَةٍ
మరియు ఎత్తైన ఆసనాల మీద (కూర్చొని) ఉంటారు. -
35
إِنَّآ أَنشَأۡنَٰهُنَّ إِنشَآءࣰ
నిశ్చయంగా, మేము వారిని ప్రత్యేక సృష్టిగా సృష్టించాము; -
36
فَجَعَلۡنَٰهُنَّ أَبۡكَارًا
మరియు వారిని (నిర్మలమైన) కన్యలుగా చేశాము; -
37
عُرُبًا أَتۡرَابࣰا
వారు ప్రేమించేవారు గానూ, సమ వయస్సుగల వారు గానూ (ఉంటారు); -
38
لِّأَصۡحَٰبِ ٱلۡيَمِينِ
కుడిపక్షం వారి కొరకు. -
39
ثُلَّةࣱ مِّنَ ٱلۡأَوَّلِينَ
అందులో చాలా మంది మొదటి తరాలకు చెందిన వారుంటారు; -
40
وَثُلَّةࣱ مِّنَ ٱلۡأٓخِرِينَ
మరియు తరువాత తరాల వారిలో నుండి చాలా మంది ఉంటారు. -
41
وَأَصۡحَٰبُ ٱلشِّمَالِ مَآ أَصۡحَٰبُ ٱلشِّمَالِ
ఇక వామ(ఎడమ) పక్షం వారు; ఆ వామపక్షం వారు ఎంత (దౌర్భాగ్యులు)? -
42
فِي سَمُومࣲ وَحَمِيمࣲ
వారు దహించే నరకాగ్నిలో మరియు సలసలకాగే నీటిలో; -
43
وَظِلࣲّ مِّن يَحۡمُومࣲ
మరియు నల్లటి పొగఛాయలో (ఉంటారు). -
44
لَّا بَارِدࣲ وَلَا كَرِيمٍ
అది చల్లగానూ ఉండదు మరియు ఓదార్చేదిగానూ ఉండదు; -
45
إِنَّهُمۡ كَانُواْ قَبۡلَ ذَٰلِكَ مُتۡرَفِينَ
నిశ్చయంగా, వారు ఇంతకు ముందు చాలా భోగభాగ్యాలలో పడి ఉండిరి; -
46
وَكَانُواْ يُصِرُّونَ عَلَى ٱلۡحِنثِ ٱلۡعَظِيمِ
మరియు వారి మూర్ఖపు పట్టుతో ఘోరమైన పాపాలలో పడి ఉండిరి; -
47
وَكَانُواْ يَقُولُونَ أَئِذَا مِتۡنَا وَكُنَّا تُرَابࣰا وَعِظَٰمًا أَءِنَّا لَمَبۡعُوثُونَ
మరియు వారు ఇలా అనేవారు: "ఏమీ? మేము మరణించి, మట్టిగా మరియు ఎముకలుగా మారిపోయిన తరువాత కూడా మరల బ్రతికించి లేపబడతామా? -
48
أَوَءَابَآؤُنَا ٱلۡأَوَّلُونَ
మరియు పూర్వీకులైన మా తాతముత్తాతలు కూడానా? -
49
قُلۡ إِنَّ ٱلۡأَوَّلِينَ وَٱلۡأٓخِرِينَ
వారితో ఇలా అను: "నిశ్చయంగా, పూర్వీకులు మరియు తరువాత వారు కూడానూ! -
50
لَمَجۡمُوعُونَ إِلَىٰ مِيقَٰتِ يَوۡمࣲ مَّعۡلُومࣲ
వారందరూ ఆ నిర్ణీత రోజు, ఆ సమయమున సమావేశ పరచబడతారు. -
51
ثُمَّ إِنَّكُمۡ أَيُّهَا ٱلضَّآلُّونَ ٱلۡمُكَذِّبُونَ
ఇక నిశ్చయంగా, మార్గభ్రష్టులైన ఓ అసత్యవాదులారా! -
52
لَأٓكِلُونَ مِن شَجَرࣲ مِّن زَقُّومࣲ
మీరు జఖ్ఖూమ్ చెట్టు (ఫలాల) ను తింటారు. -
53
فَمَالِـُٔونَ مِنۡهَا ٱلۡبُطُونَ
దానితో కడుపులు నింపుకుంటారు. -
54
فَشَٰرِبُونَ عَلَيۡهِ مِنَ ٱلۡحَمِيمِ
తరువాత, దాని మీద సలసల కాగే నీరు త్రాగుతారు. -
55
فَشَٰرِبُونَ شُرۡبَ ٱلۡهِيمِ
వాస్తవానికి మీరు దానిని దప్పిక గొన్న ఒంటెల వలే త్రాగుతారు. -
56
هَٰذَا نُزُلُهُمۡ يَوۡمَ ٱلدِّينِ
తీర్పుదినం నాడు (ఈ వామపక్షం వారికి లభించే) ఆతిథ్యం ఇదే! -
57
نَحۡنُ خَلَقۡنَٰكُمۡ فَلَوۡلَا تُصَدِّقُونَ
మిమ్మల్ని మేమే సృష్టించాము; అయితే మీరెందుకు ఇది సత్యమని నమ్మరు? -
58
أَفَرَءَيۡتُم مَّا تُمۡنُونَ
ఏమీ? మీరెప్పుడైనా, మీరు విసర్జించే వీర్యబిందువును గమనించారా? -
59
ءَأَنتُمۡ تَخۡلُقُونَهُۥٓ أَمۡ نَحۡنُ ٱلۡخَٰلِقُونَ
ఏమీ? మీరా, దానిని సృష్టించేవారు? లేక మేమా దాని సృష్టికర్తలము? -
60
نَحۡنُ قَدَّرۡنَا بَيۡنَكُمُ ٱلۡمَوۡتَ وَمَا نَحۡنُ بِمَسۡبُوقِينَ
మేమే మీ కోసం మరణం నిర్ణయించాము మరియు మమ్మల్ని అధిగమించేది ఏదీ లేదు; -
61
عَلَىٰٓ أَن نُّبَدِّلَ أَمۡثَٰلَكُمۡ وَنُنشِئَكُمۡ فِي مَا لَا تَعۡلَمُونَ
మీ రూపాలను మార్చి వేసి మీరు ఎరుగని (ఇతర రూపంలో) మిమ్మల్ని సృష్టించటం నుండి. -
62
وَلَقَدۡ عَلِمۡتُمُ ٱلنَّشۡأَةَ ٱلۡأُولَىٰ فَلَوۡلَا تَذَكَّرُونَ
మరియు వాస్తవానికి మీ మొదటి సృష్టిని గురించి మీరు తెలుసుకున్నారు; అయితే మీరెందుకు గుణపాఠం నేర్చుకోరు? -
63
أَفَرَءَيۡتُم مَّا تَحۡرُثُونَ
మీరు నాటే, విత్తనాలను గురించి, మీరెప్పుడైనా ఆలోచించారా? -
64
ءَأَنتُمۡ تَزۡرَعُونَهُۥٓ أَمۡ نَحۡنُ ٱلزَّٰرِعُونَ
మీరా వాటిని పండించేది? లేక మేమా వాటిని పండించే వారము? -
65
لَوۡ نَشَآءُ لَجَعَلۡنَٰهُ حُطَٰمࣰا فَظَلۡتُمۡ تَفَكَّهُونَ
మేము తలచుకుంటే, దానిని పొట్టుగా మార్చి వేయగలము. అప్పుడు మీరు ఆశ్చర్యంలో పడి పోతారు." -
66
إِنَّا لَمُغۡرَمُونَ
(మీరు అనేవారు): "నిశ్చయంగా, మేము పాడై పోయాము! -
67
بَلۡ نَحۡنُ مَحۡرُومُونَ
కాదు, కాదు, మేము దరిద్రుల మయ్యాము! అని. -
68
أَفَرَءَيۡتُمُ ٱلۡمَآءَ ٱلَّذِي تَشۡرَبُونَ
ఏమీ? మీరెప్పుడైనా మీరు త్రాగే నీటిని గురించి ఆలోచించారా? -
69
ءَأَنتُمۡ أَنزَلۡتُمُوهُ مِنَ ٱلۡمُزۡنِ أَمۡ نَحۡنُ ٱلۡمُنزِلُونَ
మీరా దానిని మేఘాల నుండి కురిపించే వారు? లేక మేమా దానిని కురిపించేవారము? -
70
لَوۡ نَشَآءُ جَعَلۡنَٰهُ أُجَاجࣰا فَلَوۡلَا تَشۡكُرُونَ
మేము తలచుకుంటే దానిని ఎంతో ఉప్పుగా ఉండేలా చేసేవారము! అయినా మీరెందుకు కృతజ్ఞతలు చూపరు? -
71
أَفَرَءَيۡتُمُ ٱلنَّارَ ٱلَّتِي تُورُونَ
మీరు రాజేసే అగ్నిని గమనించారా? -
72
ءَأَنتُمۡ أَنشَأۡتُمۡ شَجَرَتَهَآ أَمۡ نَحۡنُ ٱلۡمُنشِـُٔونَ
దాని వృక్షాన్ని పుట్టించినవారు మీరా? లేక దానిని ఉత్పత్తి చేసినది మేమా? -
73
نَحۡنُ جَعَلۡنَٰهَا تَذۡكِرَةࣰ وَمَتَٰعࣰا لِّلۡمُقۡوِينَ
మేము దానిని (నరకాగ్నిని), గుర్తు చేసేదిగా మరియు ప్రయాణీకులకు (అవసరం గలవారికి) ప్రయోజనకారిగా చేశాము. -
74
فَسَبِّحۡ بِٱسۡمِ رَبِّكَ ٱلۡعَظِيمِ
కావున సర్వత్తముడైన నీ ప్రభువు నామాన్ని స్తుతించు. -
75
۞ فَلَآ أُقۡسِمُ بِمَوَٰقِعِ ٱلنُّجُومِ
ఇక నేను నక్షత్రాల స్థానాల (కక్ష్యల) సాక్షిగా చెబుతున్నాను. -
76
وَإِنَّهُۥ لَقَسَمࣱ لَّوۡ تَعۡلَمُونَ عَظِيمٌ
మరియు నిశ్చయంగా, మీరు గమనించగలిగితే, ఈ శపథం ఎంతో గొప్పది! -
77
إِنَّهُۥ لَقُرۡءَانࣱ كَرِيمࣱ
నిశ్చయంగా, ఈ ఖుర్ఆన్ దివ్యమైనది. -
78
فِي كِتَٰبࣲ مَّكۡنُونࣲ
సురక్షితమైన గ్రంథంలో ఉన్నది. -
79
لَّا يَمَسُّهُۥٓ إِلَّا ٱلۡمُطَهَّرُونَ
దానిని పరిశుద్ధులు తప్ప మరెవ్వరూ తాకలేరు. -
80
تَنزِيلࣱ مِّن رَّبِّ ٱلۡعَٰلَمِينَ
ఇది సర్వలోకాల ప్రభువు తరఫు నుండి అవతరింప జేయబడింది. -
81
أَفَبِهَٰذَا ٱلۡحَدِيثِ أَنتُم مُّدۡهِنُونَ
ఏమీ? మీరు ఈ సందేశాన్ని తేలికగా తీసుకుంటున్నారా? -
82
وَتَجۡعَلُونَ رِزۡقَكُمۡ أَنَّكُمۡ تُكَذِّبُونَ
మరియు (అల్లాహ్) మీకు ప్రసాదిస్తున్న జీవనోపాధికి (కృతజ్ఞతలు) చూపక, వాస్తవానికి ఆయనను మీరు తిరస్కరిస్తున్నారా? -
83
فَلَوۡلَآ إِذَا بَلَغَتِ ٱلۡحُلۡقُومَ
అయితే (చనిపోయేవాడి) ప్రాణం గొంతులోనికి వచ్చినపుడు, మీరెందుకు (ఆపలేరు)? -
84
وَأَنتُمۡ حِينَئِذࣲ تَنظُرُونَ
మరియు అప్పుడు మీరు (ఏమీ చేయలేక) చూస్తూ ఉండిపోతారు. -
85
وَنَحۡنُ أَقۡرَبُ إِلَيۡهِ مِنكُمۡ وَلَٰكِن لَّا تُبۡصِرُونَ
మరియు అప్పుడు మేము అతనికి మీకంటే చాలా దగ్గరలో ఉంటాము, కాని మీరు చూడలేక పోతారు. -
86
فَلَوۡلَآ إِن كُنتُمۡ غَيۡرَ مَدِينِينَ
ఒకవేళ మీరు ఎవరి అదుపాజ్ఞలో (ఆధీనంలో) లేరనుకుంటే; -
87
تَرۡجِعُونَهَآ إِن كُنتُمۡ صَٰدِقِينَ
మీరు సత్యవంతులే అయితే దానిని (ఆ ప్రాణాన్ని) ఎందుకు తిరిగి రప్పించుకోలేరు? -
88
فَأَمَّآ إِن كَانَ مِنَ ٱلۡمُقَرَّبِينَ
కాని అతడు (మరణించేవాడు), (అల్లాహ్) సాన్నిధ్యాన్ని పొందినవాడైతే! -
89
فَرَوۡحࣱ وَرَيۡحَانࣱ وَجَنَّتُ نَعِيمࣲ
అతని కొరకు సుఖసంతోషాలు మరియు తృప్తి మరియు పరమానందకరమైన స్వర్గవనం ఉంటాయి. -
90
وَأَمَّآ إِن كَانَ مِنۡ أَصۡحَٰبِ ٱلۡيَمِينِ
మరియు ఎవడైతే కుడిపక్షం వారికి చెందినవాడో! -
91
فَسَلَٰمࣱ لَّكَ مِنۡ أَصۡحَٰبِ ٱلۡيَمِينِ
అతనితో: "నీకు శాంతి కలుగుగాక (సలాం)! నీవు కుడిపక్షం వారిలో చేరావు." (అని అనబడుతుంది). -
92
وَأَمَّآ إِن كَانَ مِنَ ٱلۡمُكَذِّبِينَ ٱلضَّآلِّينَ
మరియు ఎవడైతే, అసత్యవాదులు, మార్గభ్రష్టులైన వారిలో చేరుతాడో! -
93
فَنُزُلࣱ مِّنۡ حَمِيمࣲ
అతని ఆతిథ్యానికి సలసల కాగే నీరు ఉంటుంది. -
94
وَتَصۡلِيَةُ جَحِيمٍ
మరియు భగభగమండే నరకాగ్ని ఉంటుంది. -
95
إِنَّ هَٰذَا لَهُوَ حَقُّ ٱلۡيَقِينِ
నిశ్చయంగా, ఇది రూఢి అయిన నమ్మదగిన సత్యం! -
96
فَسَبِّحۡ بِٱسۡمِ رَبِّكَ ٱلۡعَظِيمِ
కావున సర్వత్తముడైన నీ ప్రభువు పేరును స్తుతించు.