Surah Al-Qiyamah in తెలుగు
سورة القيامة · Verses: 40 · Meccan
Translation: తెలుగు translation (الترجمة التلجوية)
-
1
لَآ أُقۡسِمُ بِيَوۡمِ ٱلۡقِيَٰمَةِ
అలా కాదు! నేను పునరుత్థాన దినపు శపథం చేస్తున్నాను. -
2
وَلَآ أُقۡسِمُ بِٱلنَّفۡسِ ٱللَّوَّامَةِ
అలా కాదు! నేను తనను తాను నిందించుకునే అంతరాత్మ శపథం చేస్తున్నాను. -
3
أَيَحۡسَبُ ٱلۡإِنسَٰنُ أَلَّن نَّجۡمَعَ عِظَامَهُۥ
ఏమిటి? మేము అతని ఎముకలను ప్రోగు చేయలేమని మానవుడు భావిస్తున్నాడా? -
4
بَلَىٰ قَٰدِرِينَ عَلَىٰٓ أَن نُّسَوِّيَ بَنَانَهُۥ
వాస్తవానికి! మేము అతని వ్రేళ్ళ కొనలను గూడా సరిగ్గా సవరించగల సమర్ధులము. -
5
بَلۡ يُرِيدُ ٱلۡإِنسَٰنُ لِيَفۡجُرَ أَمَامَهُۥ
అయినా, మానవుడు ఇక మీద కూడా దుష్కార్యాలు చేయగోరుతున్నాడు. -
6
يَسۡـَٔلُ أَيَّانَ يَوۡمُ ٱلۡقِيَٰمَةِ
అతడు: "అయితే ఈ పునరుత్థాన దినం ఎప్పుడు వస్తుంది?" అని అడుగుతున్నాడు. -
7
فَإِذَا بَرِقَ ٱلۡبَصَرُ
కళ్ళు మిరుమిట్లుగొన్నప్పుడు; -
8
وَخَسَفَ ٱلۡقَمَرُ
మరియు చంద్రునికి గ్రహణం పట్టినప్పుడు; -
9
وَجُمِعَ ٱلشَّمۡسُ وَٱلۡقَمَرُ
మరియు సూర్యచంద్రులు కలిపి వేయబడినప్పుడు; -
10
يَقُولُ ٱلۡإِنسَٰنُ يَوۡمَئِذٍ أَيۡنَ ٱلۡمَفَرُّ
మానవుడు ఆ రోజు: "ఎక్కడికి పారి పోవాలి?" అని అంటాడు. -
11
كَلَّا لَا وَزَرَ
అది కాదు! (అతనికి) ఎక్కడా శరణం ఉండదు! -
12
إِلَىٰ رَبِّكَ يَوۡمَئِذٍ ٱلۡمُسۡتَقَرُّ
ఆ రోజు నీ ప్రభువు వద్దనే ఆశ్రయం ఉంటుంది. -
13
يُنَبَّؤُاْ ٱلۡإِنسَٰنُ يَوۡمَئِذِۭ بِمَا قَدَّمَ وَأَخَّرَ
ఆ రోజు మానవుడికి, తాను చేసి పంపంది మరియు వెనక వదలింది అంతా తెలుపబడుతుంది. -
14
بَلِ ٱلۡإِنسَٰنُ عَلَىٰ نَفۡسِهِۦ بَصِيرَةࣱ
అలా కాదు! మానవుడు తనకు విరుద్ధంగా, తానే సాక్షి అవుతాడు; -
15
وَلَوۡ أَلۡقَىٰ مَعَاذِيرَهُۥ
మరియు అతడు ఎన్ని సాకులు చెప్పినా సరే! -
16
لَا تُحَرِّكۡ بِهِۦ لِسَانَكَ لِتَعۡجَلَ بِهِۦٓ
నీవు దీనిని (ఈ ఖుర్ఆన్ ను గ్రహించటానికి) నీ నాలుకను త్వరత్వరగా కదిలించకు. -
17
إِنَّ عَلَيۡنَا جَمۡعَهُۥ وَقُرۡءَانَهُۥ
నిశ్చయంగా, దీనిని సేకరించటం మరియు దీనిని చదివించటం మా బాధ్యతే! -
18
فَإِذَا قَرَأۡنَٰهُ فَٱتَّبِعۡ قُرۡءَانَهُۥ
కావున మేము దీనిని పఠించినప్పుడు నీవు ఆ పారాయణాన్ని శ్రద్ధగా అనుసరించు. -
19
ثُمَّ إِنَّ عَلَيۡنَا بَيَانَهُۥ
ఇక దాని భావాన్ని అర్థమయ్యేలా చేయటం మా బాధ్యతే! -
20
كَلَّا بَلۡ تُحِبُّونَ ٱلۡعَاجِلَةَ
అలా కాదు! వాస్తవానికి మీరు అనిశ్చితమైన (ఇహలోక జీవితం పట్ల) వ్యామోహం పెంచుకుంటున్నారు; -
21
وَتَذَرُونَ ٱلۡأٓخِرَةَ
మరియు పరలోక జీవితాన్ని వదలి పెడుతున్నారు! -
22
وُجُوهࣱ يَوۡمَئِذࣲ نَّاضِرَةٌ
ఆ రోజున కొన్ని ముఖాలు కళకళ లాడుతూ ఉంటాయి; -
23
إِلَىٰ رَبِّهَا نَاظِرَةࣱ
తమ ప్రభువు (అల్లాహ్) వైపునకు చూస్తూ ఉంటాయి; -
24
وَوُجُوهࣱ يَوۡمَئِذِۭ بَاسِرَةࣱ
మరికొన్ని ముఖాలు ఆ రోజు, కాంతిహీనమై ఉంటాయి; -
25
تَظُنُّ أَن يُفۡعَلَ بِهَا فَاقِرَةࣱ
నడుమును విరిచే బాధ వారికి కలుగుతుందని భావించి. -
26
كَلَّآ إِذَا بَلَغَتِ ٱلتَّرَاقِيَ
అలా కాదు! ప్రాణం గొంతులోకి వచ్చినపుడు; -
27
وَقِيلَ مَنۡۜ رَاقࣲ
మరియు: "ఎవడైనా ఉన్నాడా? అతనిని (మరణం నుండి) కాపాడటానికి?" అని అనబడుతుంది. -
28
وَظَنَّ أَنَّهُ ٱلۡفِرَاقُ
మరియు అప్పుడతడు వాస్తవానికి తన ఎడబాటు కాలం వచ్చిందని గ్రహిస్తాడు; -
29
وَٱلۡتَفَّتِ ٱلسَّاقُ بِٱلسَّاقِ
మరియు ఒక పిక్క మరొక పిక్కతో కలిసిపోతుంది. -
30
إِلَىٰ رَبِّكَ يَوۡمَئِذٍ ٱلۡمَسَاقُ
ఆ రోజు నీ ప్రభువు వైపునకే ప్రయాణం ఉంటుంది! -
31
فَلَا صَدَّقَ وَلَا صَلَّىٰ
కాని అతడు సత్యాన్ని నమ్మలేదు మరియు నమాజ్ సలపనూ లేదు! -
32
وَلَٰكِن كَذَّبَ وَتَوَلَّىٰ
మరియు అతడు (ఈ సందేశాన్ని) అసత్యమన్నాడు మరియు దాని నుండి వెనుదిరిగాడు! -
33
ثُمَّ ذَهَبَ إِلَىٰٓ أَهۡلِهِۦ يَتَمَطَّىٰٓ
ఆ తరువాత నిక్కుతూ నీల్గుతూ తన ఇంటివారి వద్దకు పోయాడు! -
34
أَوۡلَىٰ لَكَ فَأَوۡلَىٰ
(ఓ సత్యతిరస్కారుడా!) నీకు నాశనం మీద నాశనం రానున్నది! -
35
ثُمَّ أَوۡلَىٰ لَكَ فَأَوۡلَىٰٓ
అవును, నీకు నాశనం మీద నాశనం రానున్నది! -
36
أَيَحۡسَبُ ٱلۡإِنسَٰنُ أَن يُتۡرَكَ سُدًى
ఏమిటీ? మానవుడు తనను విచ్చల విడిగా వదలిపెట్టండం జరుగుతుందని భావిస్తున్నాడా? -
37
أَلَمۡ يَكُ نُطۡفَةࣰ مِّن مَّنِيࣲّ يُمۡنَىٰ
ఏమీ? అతడు ప్రసరింప జేయబడిన ఒక వీర్యబిందువు కాడా? -
38
ثُمَّ كَانَ عَلَقَةࣰ فَخَلَقَ فَسَوَّىٰ
తరువాత ఒక రక్తకండగా (జలగగా) ఉండేవాడు కాదా? తరువాత ఆయనే (అల్లాహ్ యే) అతనిని సృష్టించి అతని రూపాన్ని తీర్చిదిద్దాడు. -
39
فَجَعَلَ مِنۡهُ ٱلزَّوۡجَيۡنِ ٱلذَّكَرَ وَٱلۡأُنثَىٰٓ
ఆ తరువాత అతని నుండి స్త్రీ పురుషుల రెండు రకాలను (జాతులను) ఏర్పరచాడు. -
40
أَلَيۡسَ ذَٰلِكَ بِقَٰدِرٍ عَلَىٰٓ أَن يُحۡـِۧيَ ٱلۡمَوۡتَىٰ
అలాంటప్పుడు ఆయనకు మరణించిన వారిని మళ్ళీ బ్రతికించే సామర్థ్యం లేదా?