سورة القارعة

الترجمة التلجوية

ترجمة معاني سورة القارعة باللغة التلجوية من كتاب الترجمة التلجوية

مولانا عبد الرحيم بن محمد

الترجمة التلجوية

مولانا عبد الرحيم بن محمد

الناشر

مجمع الملك فهد

آية رقم 1
ఆ! అదరగొట్టే మహా ఉపద్రవం!
آية رقم 2
ఏమిటా అదరగొట్టే మహా ఉపద్రవం?
آية رقم 3
మరియు ఆ అదరగొట్టే మహా ఉపద్రవం, అంటే ఏమిటో నీకేం తెలుసు?
آية رقم 4
ఆ రోజు మానవులు చెల్లాచెదురైన చిమ్మెటల వలే అయిపోతారు.
آية رقم 5
మరియు పర్వతాలు రంగు రంగుల ఏకిన దూది వలే అయి పోతాయి.
آية رقم 6
అప్పుడు ఎవడి త్రాసుపళ్ళాలు (సత్కార్యాలతో) బరువుగా ఉంటాయో!
آية رقم 7
అతడు (స్వర్గంలో) సుఖవంతమైన జీవితం గడుపుతాడు.
آية رقم 8
మరియు ఎవడి (సత్కార్యాల) త్రాసు పళ్ళాలు తేలికగా ఉంటాయో!
آية رقم 9
అతని నివాసం అధః పాతాళమే.
آية رقم 10
మరియు అది ఏమిటో నీకేం తెలుసు?
آية رقم 11
అదొక భగభగమండే అగ్ని (గుండం).
تقدم القراءة