سورة الزلزلة

الترجمة التلجوية

ترجمة معاني سورة الزلزلة باللغة التلجوية من كتاب الترجمة التلجوية

مولانا عبد الرحيم بن محمد

الترجمة التلجوية

مولانا عبد الرحيم بن محمد

الناشر

مجمع الملك فهد

آية رقم 1
భూమి తన అతి తీవ్రమైన (అంతిమ) భూకంపంతో కంపింపజేయబడినప్పుడు!
آية رقم 2
మరియు భూమి తన భారాన్నంతా తీసి బయట పడ వేసినప్పుడు!
آية رقم 3
మరియు మానవుడు: "దీనికి ఏమయింది?" అని అన్నప్పుడు.
آية رقم 4
ఆ రోజు అది తన సమాచారాలను వివరిస్తుంది.
آية رقم 5
ఎందుకంటే, నీ ప్రభువు దానిని ఆదేశించి ఉంటాడు.
آية رقم 6
ఆ రోజు ప్రజలు తమ తమ కర్మలు చూపించబడటానికి వేర్వేరు గుంపులలో వెళ్తారు.
آية رقم 7
అప్పుడు, ప్రతివాడు తాను, రవ్వంత (పరమాణువంత) మంచిని చేసి ఉన్నా, దానిని చూసుకుంటాడు.
آية رقم 8
మరియు అలాగే, ప్రతివాడు తాను రవ్వంత (పరమాణువంత) చెడును చేసి ఉన్నా, దానిని చూసుకుంటాడు.
تقدم القراءة