سورة التين

الترجمة التلجوية

ترجمة معاني سورة التين باللغة التلجوية من كتاب الترجمة التلجوية

مولانا عبد الرحيم بن محمد

الترجمة التلجوية

مولانا عبد الرحيم بن محمد

الناشر

مجمع الملك فهد

آية رقم 1
అంజూరం (అత్తిపండు) మరియు జైతూన్ సాక్షిగా!
آية رقم 2
సీనాయ్ (తూర్) కొండ సాక్షిగా!
آية رقم 3
ఈ శాంతి నగరం (మక్కా) సాక్షిగా!
آية رقم 4
వాస్తవంగా! మేము మానవుడిని సర్వశ్రేష్ఠమైన ఆకారంలో సృష్టించాము.
آية رقم 5
తరువాత మేము అతన్ని దిగజార్చి అధమాతి - అధమమైన స్థితికి మార్చాము.
కాని విశ్వసించి, సత్కార్యాలు చేసేవారు తప్ప! ఎందుకంటే అలాంటి వారికి అంతులేని ప్రతిఫలం ఉంది.
آية رقم 7
అయితే (ఓ మానవుడా!) దీని తరువాత కూడా నీవు ఎందుకు ప్రతిఫలదినాన్ని తిరస్కరిస్తున్నావు?
آية رقم 8
ఏమీ? అల్లాహ్ న్యాయాధిపతులలోకెల్లా సర్వోత్తమ న్యాయాధిపతి కాడా?
تقدم القراءة