سورة المدثر

الترجمة التلجوية

ترجمة معاني سورة المدّثر باللغة التلجوية من كتاب الترجمة التلجوية

مولانا عبد الرحيم بن محمد

الترجمة التلجوية

مولانا عبد الرحيم بن محمد

الناشر

مجمع الملك فهد

آية رقم 1
ఓ దుప్పటిలో చుట్టుకున్నవాడా!
آية رقم 2
లే! ఇక హెచ్చరించు!
آية رقم 3
మరియు మీ ప్రభువు గొప్పతనాన్ని (ఘనతను) కొనియాడు (చాటి చెప్పు)!
آية رقم 4
మరియు నీ వస్త్రాలను పరిశుభ్రంగా ఉంచుకో!
آية رقم 5
మరియు మాలిన్యానికి దూరంగా ఉండు!
آية رقم 6
మరియు ఎక్కువ పొందాలనే ఆశతో ఇవ్వకు (ఉపకారం చేయకు)!
آية رقم 7
మరియు నీ ప్రభువు కొరకు సహనం వహించు!
آية رقم 8
మరియు బాకా (నాఖూర్) ఊదబడినప్పుడు;
آية رقم 9
ఆ దినం చాలా కఠినమైన దినమై ఉంటుంది;
آية رقم 10
సత్యతిరస్కారులకు అది సులభమైన (దినం) కాదు.
آية رقم 11
వదలండి! నన్నూ మరియు నేను ఒంటరిగా పుట్టించిన వానినీ!
آية رقم 12
మరియు నేను అతనికి పుష్కలంగా సంపదనిచ్చాను.
آية رقم 13
మరియు అతనికి తోడుగా ఉండే కుమారులను!
آية رقم 14
మరియు అతను కొరకు అతని జీవన సౌకర్యాలను సులభం చేశాను.
آية رقم 15
అయినా నేను అతనికి ఇంకా ఇవ్వాలని అతడు ఆశిస్తూ ఉంటాడు.
آية رقم 16
అలా కాదు! వాస్తవానికి అతడు మా (అల్లాహ్) సూచనల (ఆయాత్ ల) పట్ల విరోధం కలిగి వున్నాడు.
آية رقم 17
నేను త్వరలోనే అతనిని దుర్గమమైన స్థానానికి (శిక్షకు) నెట్టుతాను!
آية رقم 18
వాస్తవానికి, అతడు ఆలోచించాడు మరియు మనస్సులో ప్రణాళిక చేసుకున్నాడు.
آية رقم 19
కావున (అతనిని) తాను ప్రణాళిక చేసుకున్నట్లు నాశనానికి గురి కానివ్వండి!
آية رقم 20
అవును (అతనిని) తాను ప్రణాళిక చేసుకున్నట్లు, నాశనానికి గురి కానివ్వండి!
آية رقم 21
అప్పుడు అతడు ఆలోచించాడు.
آية رقم 22
తరువాత అతడు నుదరు చిట్లించుకున్నాడు మరియు కోపంతో చూశాడు (ముఖం మాడ్చుకున్నాడు);
آية رقم 23
తరువాత అతడు వెనుకకు మరలి దురహంకారం చూపాడు.
آية رقم 24
అప్పుడు అతడు ఇలా అన్నాడు: "ఇది పూర్వ నుండి వస్తూ వున్న ఒక మంత్రజాలం మాత్రమే!
آية رقم 25
ఇది కేవలం ఒక మానవ హక్కు మాత్రమే
آية رقم 26
త్వరలోనే నేను అతనిని నరకాగ్నిలో కాల్చుతాను.
آية رقم 27
మరియు ఆ నరకాగ్ని అంటే నీవు ఏమనుకుంటున్నావు?
آية رقم 28
అది (ఎవరినీ) మిగల్చదు మరియు వదలి పెట్టదు.
آية رقم 29
అది మానవుణ్ణి (అతడి చర్మాన్ని0 దహించి వేస్తుంది.
آية رقم 30
దానిపై పందొమ్మిది (దేవదూతలు నియమించబడి) ఉన్నారు.
మరియు మేము దేవదూతలను మాత్రమే నరకానికి రక్షకులుగా నియమించాము. మరియు మేము వారి సంఖ్యను (పందొమ్మిదిని), సత్యతిరస్కారులకు ఒక పరీక్షగా, గ్రంథ ప్రజలకు నమ్మకం కలగటానికి, విశ్వాసుల విశ్వాసాన్ని అధికం చేయటానికి మరియు గ్రంథ ప్రజలు మరియు విశ్వాసులు సందేహంలో పడకుండా ఉండటానికి మరియు తమ హృదయాలలో రోగమున్న వారు మరియు సత్యతిరస్కారులు: "ఈ ఉపమానం ఇవ్వటంలో అల్లాహ్ ఉద్దేశమేమిటి?" అని పలుకటానికి! ఈ విధంగా అల్లాహ్ తాను కోరిన వారిని మార్గభ్రష్టత్వంలో వదలుతాడు. మరియు తాను కోరిన వారికి మార్గదర్శకత్వం చేస్తాడు. మరియు నీ ప్రభూవు సైన్యాలను ఆయన తప్ప మరెవ్వరూ ఎరుగరు. మరియు ఇదంతా మానవునికి ఒక జ్ఞాపిక మాత్రమే.
آية رقم 32
అలా కాదు! చంద్రుని సాక్షిగా!
آية رقم 33
గడిచిపోయే రాత్రి సాక్షిగా!
آية رقم 34
ప్రకాశించే, ఉదయం సాక్షిగా!
آية رقم 35
నిశ్చయంగా, ఇది (ఈ నరకాగ్ని ప్రస్తావన) ఒక గొప్ప విషయం.
آية رقم 36
మానవునికి ఒక హెచ్చరిక;
آية رقم 37
మీలో ముందుకు రావాలని కోరుకునే వానికి లేదా వెనుక ఉండి పోయేవానికి;
آية رقم 38
ప్రతి మానవుడు తాను చేసిన కర్మలకు తాకట్టుగా ఉంటాడు.
آية رقم 39
కుడిపక్షం వారు తప్ప!
آية رقم 40
వారు స్వర్గాలలో ఉంటూ ఒకరినొకరు ఇలా ప్రశ్నించుకుంటారు!
آية رقم 41
అపరాధులను గురించి (మరియు వారితో అంటారు):
آية رقم 42
"మిమ్మల్ని ఏ విషయం నరకంలోకి ప్రవేశింపజేసింది?"
آية رقم 43
వారు (నరకవాసులు) ఇలా జవాబిస్తారు: "మేము నమాజ్ చేసే వాళ్ళం కాము.
آية رقم 44
మరియు నిరుపేదలకు ఆహారం పెట్టేవాళ్ళం కాము;
آية رقم 45
మరియు వృథా కాలక్షేపం చేసే వారితో కలిసి వ్యర్థ ప్రలాపాలు (ప్రసంగాలు) చేస్తూ ఉండే వాళ్ళము;
آية رقم 46
మరియు తీర్పుదినాన్ని అబద్ధమని నిరాకరిస్తూ ఉండేవాళ్ళము;
آية رقم 47
చివరకు ఆ అనివార్యమైన ఘడియ మాపై వచ్చి పడింది.
آية رقم 48
అప్పుడు సిఫారసు చేసేవారి సిఫారసు వారికి ఏ మాత్రం ఉపయోగపడదు.
آية رقم 49
అయితే, వారికేమయింది? ఈ హితోపదేశం నుండి వారెందుకు ముఖం త్రిప్పుకుంటున్నారు.
آية رقم 50
వారి స్థితి బెదిరిన అడవి గాడిదల మాదిరిగా ఉంది;
آية رقم 51
సింహం నుండి పారిపోయే (గాడిదల మాదిరిగా)!
అలా కాదు! వారిలో ప్రతి ఒక్క వ్యక్తి తనకు విప్పబడిన గ్రంథాలు ఇవ్వబడాలని కోరుతున్నాడు.
آية رقم 53
కాదు! కాదు! అసలు వారు పరలోక జీవితం గురించి భయపడటం లేదు.
آية رقم 54
అలా కాదు! నిశ్చయంగా, ఇది ఒక హితోపదేశం.
آية رقم 55
కావున కోరినవాడు దీని నుండి హితబోధ గ్రహించవచ్చు.
కాని అల్లాహ్ కోరితే తప్ప! వీరు దీని నుండి హితబోధ గ్రహించలేరు. ఆయనే (అల్లాహ్ యే) భయభక్తులకు అర్హుడు మరియు ఆయనే క్షమించే అర్హత గలవాడు.
تقدم القراءة