ترجمة معاني سورة الفجر باللغة التلجوية من كتاب الترجمة التلجوية
مولانا عبد الرحيم بن محمد
آية رقم 1
ﭤ
ﭥ
ప్రాంతః కాలం సాక్షిగా!
آية رقم 2
ﭦﭧ
ﭨ
పది రాత్రుల సాక్షిగా!
آية رقم 3
ﭩﭪ
ﭫ
సరి బేసీల సాక్షిగా!
آية رقم 4
ﭬﭭﭮ
ﭯ
గడచిపోయే రాత్రి సాక్షిగా!
آية رقم 5
ﭰﭱﭲﭳﭴﭵ
ﭶ
వీటిలో బుద్ధిగల వాని కొరకు ఏ ప్రమాణమూ లేదా ఏమిటి?
آية رقم 6
ﭷﭸﭹﭺﭻﭼ
ﭽ
నీ ప్రభువు ఆద్ (జాతి) వారి పట్ల ఎలా వ్యవహరించాడో నీకు తెలియదా?
آية رقم 7
ﭾﭿﮀ
ﮁ
ఎత్తైన స్థంభాల (భవనాలు గల) ఇరమ్ ప్రజల పట్ల?
آية رقم 8
ﮂﮃﮄﮅﮆﮇ
ﮈ
వారిలాంటి జాతి భూమిలో ఎన్నడూ సృష్టించబడలేదు.
آية رقم 9
ﮉﮊﮋﮌﮍ
ﮎ
మరియు లోయలలోని కొండరాళ్ళలో (భవనాలను) తొలిచిన సమూద్ జాతి పట్ల?
آية رقم 10
ﮏﮐﮑ
ﮒ
మరియు మేకులవాడైన ఫిర్ఔన్ పట్ల?
آية رقم 11
ﮓﮔﮕﮖ
ﮗ
వారంతా ఆయా దేశాలలో తలబిరుసుతనంతో ప్రవర్తించారు;
آية رقم 12
ﮘﮙﮚ
ﮛ
మరియు వాటిలో దౌర్జన్యాన్ని రేకెత్తించారు.
آية رقم 13
ﮜﮝﮞﮟﮠ
ﮡ
కాబట్టి నీ ప్రభువు వారిపైకి అనేక రకాల బాధాకరమైన శిక్షలను పంపాడు.
آية رقم 14
ﮢﮣﮤ
ﮥ
వాస్తవానికి, నీ ప్రభువు మాటు వేసి ఉన్నాడు (అంతా కనిపెడ్తూ ఉంటాడు)!
آية رقم 15
అయితే మానవుడు ఎలాంటి వాడంటే: అతని ప్రభువు అతన్ని పరీక్షించటానికి, అతనికి గౌరవ ప్రతిష్టల నిచ్చి అనుగ్రహించి నప్పుడు: "నా ప్రభువు నన్ను గౌరవించాడు." అని అంటాడు;
آية رقم 16
కాని, అతన్ని పరీక్షించటానికి, అతని ఉపాధిని తగ్గించినప్పుడు: "నా ప్రభువు నన్ను అవమానించాడు." అని అంటాడు.
آية رقم 17
ﯞﯟﯠﯡﯢﯣ
ﯤ
అలా కాదు, వాస్తవానికి మీరు అనాథులను ఆదరించరు;
آية رقم 18
ﯥﯦﯧﯨﯩ
ﯪ
మరియు మీరు పేదలకు అన్నం పెట్టే విషయంలో ఒకరినొకరు ప్రోత్సహించుకోరు;
آية رقم 19
ﯫﯬﯭﯮ
ﯯ
మరియు వారసత్వపు ఆస్తిని పేరాశతో అంతా మీరే తినేస్తారు.
آية رقم 20
ﯰﯱﯲﯳ
ﯴ
మరియు మీరు ధనవ్యామోహంలో దారుణంగా చిక్కుకు పోయారు!
آية رقم 21
అలా కాదు, భూమి, దంచి పిండిపిండిగా చేయబడినపుడు;
آية رقم 22
ﯽﯾﯿﰀﰁ
ﰂ
మరియు నీ ప్రభువు (స్వయంగా) వస్తాడు మరియు దేవదూతలు వరుసలలో వస్తారు.
آية رقم 23
ఆ రోజు నరకం (ముందుకు) తీసుకు రాబడుతుంది. ఆ రోజు మానవుడు (తన కర్మలన్నీ) జ్ఞప్తికి తెచ్చుకుంటాడు; కాని ఆ రోజు జ్ఞప్తికి తెచ్చుకోవడం వల్ల అతనికి కలిగే ప్రయోజనమేమిటీ?
آية رقم 24
ﭜﭝﭞﭟ
ﭠ
అతడు: "అయ్యో! నా పాడుగానూ! నా ఈ జీవితం కొరకు నేను (సత్కార్యాలు) చేసి పంపు కొని ఉంటే ఎంత బాగుండేది!" అని వాపోతాడు.
آية رقم 25
ﭡﭢﭣﭤﭥ
ﭦ
అయితే, ఆ రోజు, ఆయన (అల్లాహ్) శిక్షించినట్లు, మరెవ్వడూ శిక్షించలేడు!
آية رقم 26
ﭧﭨﭩﭪ
ﭫ
మరియు ఆయన (అల్లాహ్) బంధించినట్లు, మరెవ్వడూ బంధించలేడు.
آية رقم 27
ﭬﭭﭮ
ﭯ
(సన్మార్గునితో ఇలా అనబడుతుంది): "ఓ తృప్తి పొందిన ఆత్మా!
آية رقم 28
ﭰﭱﭲﭳﭴ
ﭵ
నీ ప్రభువు సన్నిధికి మరలి రా! (నీకు లభించే సత్ఫలితానికి) ఆనందిస్తూ మరియు (నీ ప్రభువునకు) ప్రియమైనదానివై!
آية رقم 29
ﭶﭷﭸ
ﭹ
నీవు (పుణ్యాత్ములైన) నా దాసులలో చేరిపో!
آية رقم 30
ﭺﭻ
ﭼ
మరియు నీవు నా స్వర్గంలో ప్రవేశించు!"
تقدم القراءة