Surah At-Takwir in తెలుగు
سورة التكوير · Verses: 29 · Meccan
Translation: తెలుగు translation (الترجمة التلجوية)
-
1
إِذَا ٱلشَّمۡسُ كُوِّرَتۡ
సూర్యుడు (అంధకారంలో) చుట్టి పోయబడి కాంతిహీనుడైనప్పుడు! -
2
وَإِذَا ٱلنُّجُومُ ٱنكَدَرَتۡ
మరియు నక్షత్రాలు (కాంతిని కోల్పోయి) రాలిపోవునప్పుడు! -
3
وَإِذَا ٱلۡجِبَالُ سُيِّرَتۡ
మరియు పర్వతాలు కదిలించబడినప్పుడు! -
4
وَإِذَا ٱلۡعِشَارُ عُطِّلَتۡ
మరియు నిండు సూడి ఒంటెలు, నిరపేక్షంగా వదిలివేయబడినప్పుడు! -
5
وَإِذَا ٱلۡوُحُوشُ حُشِرَتۡ
మరియు క్రూరమృగాలన్నీ ఒకచేట సమకూర్చబడినప్పుడు! -
6
وَإِذَا ٱلۡبِحَارُ سُجِّرَتۡ
మరియు సముద్రాలు ఉప్పొంగిపోయి నప్పుడు! -
7
وَإِذَا ٱلنُّفُوسُ زُوِّجَتۡ
మరియు ఆత్మలు (శరీరాలతో) తిరిగి కలుపబడి నప్పుడు! -
8
وَإِذَا ٱلۡمَوۡءُۥدَةُ سُئِلَتۡ
మరియు సజీవంగా పాతి పెట్టబడిన బాలిక ప్రశ్నించబడినప్పుడు: -
9
بِأَيِّ ذَنۢبࣲ قُتِلَتۡ
ఏ అపరాధానికి తాను హత్య చేయబడిందని? -
10
وَإِذَا ٱلصُّحُفُ نُشِرَتۡ
మరియు కర్మపత్రాలు తెరువబడినప్పుడు! -
11
وَإِذَا ٱلسَّمَآءُ كُشِطَتۡ
మరియు ఆకాశం ఒలిచి వేయబడినప్పుడు! -
12
وَإِذَا ٱلۡجَحِيمُ سُعِّرَتۡ
మరియు నరకాగ్ని మండించబడినప్పుడు! -
13
وَإِذَا ٱلۡجَنَّةُ أُزۡلِفَتۡ
మరియు స్వర్గం దగ్గరకు తీసుకురాబడినప్పుడు! -
14
عَلِمَتۡ نَفۡسࣱ مَّآ أَحۡضَرَتۡ
ప్రతి ఆత్మ తాను చేసి తెచ్చిన కర్మలను తెలుసుకుంటుంది. -
15
فَلَآ أُقۡسِمُ بِٱلۡخُنَّسِ
అలా కాదు! నేను తొలగిపోయే నక్షత్రాల సాక్షిగా చెబుతున్నాను; -
16
ٱلۡجَوَارِ ٱلۡكُنَّسِ
(ఏవైతే) వేగంగా తిరుగుతూ కనుమరుగవుతున్నాయో! -
17
وَٱلَّيۡلِ إِذَا عَسۡعَسَ
మరియు గడచి పోయే రాత్రి సాక్షిగా! -
18
وَٱلصُّبۡحِ إِذَا تَنَفَّسَ
మరియు ప్రకాశించే ఉదయం సాక్షిగా! -
19
إِنَّهُۥ لَقَوۡلُ رَسُولࣲ كَرِيمࣲ
నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) గౌరవనీయుడైన సందేశహరుడు తెచ్చిన వాక్కు! -
20
ذِي قُوَّةٍ عِندَ ذِي ٱلۡعَرۡشِ مَكِينࣲ
అతను (జిబ్రీల్) మహా బలశాలి, సింహాసన (అర్ష్) అధిపతి సన్నిధిలో ఉన్నత స్థానం గలవాడు! -
21
مُّطَاعࣲ ثَمَّ أَمِينࣲ
అతని ఆజ్ఞలు పాటింపబడతాయి మరియు (అతను) విశ్వసనీయుడు! -
22
وَمَا صَاحِبُكُم بِمَجۡنُونࣲ
మరియు (ఓ ప్రజలారా!) మీ సహచరుడు పిచ్చివాడు కాడు! -
23
وَلَقَدۡ رَءَاهُ بِٱلۡأُفُقِ ٱلۡمُبِينِ
మరియు వాస్తవంగా, అతను ఆ సందేశహరుణ్ణి (జిబ్రీల్ ను) ప్రకాశవంతమైన దిఙ్మండలంలో చూశాడు. -
24
وَمَا هُوَ عَلَى ٱلۡغَيۡبِ بِضَنِينࣲ
మరియు అతను (ముహమ్మద్) అగోచర జ్ఞానాన్ని ప్రజల నుండి దాచేవాడు కాడు. -
25
وَمَا هُوَ بِقَوۡلِ شَيۡطَٰنࣲ رَّجِيمࣲ
మరియు ఇది (ఈ ఖుర్ఆన్) శపించ (బహిష్కరించ) బడిన షైతాన్ వాక్కు కాదు. -
26
فَأَيۡنَ تَذۡهَبُونَ
మరి మీరు ఎటు పోతున్నారు? -
27
إِنۡ هُوَ إِلَّا ذِكۡرࣱ لِّلۡعَٰلَمِينَ
ఇది (ఈ ఖుర్ఆన్) సర్వలోకాలకు ఒక హితోపదేశం. -
28
لِمَن شَآءَ مِنكُمۡ أَن يَسۡتَقِيمَ
మీలో, ఋజుమార్గంలో నడవ దలచుకున్న ప్రతివాని కొరకు. -
29
وَمَا تَشَآءُونَ إِلَّآ أَن يَشَآءَ ٱللَّهُ رَبُّ ٱلۡعَٰلَمِينَ
మరియు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ తలచనంత వరకు, మీరు తలచినంత మాత్రాన ఏమీ కాదు.