ﰖ
                    surah.translation
            .
            
    
                                    من تأليف: 
                                             مولانا عبد الرحيم بن محمد
                                                            .
                                                
            ﰡ
ఏమీ? ఏనుగువారి (సైన్యంతో) నీ ప్రభువు ఎలా వ్యవహరించాడో నీకు తెలియదా?
                                                                        ఏమీ? ఆయన వారి కుట్రను భంగం చేయలేదా?
                                                                        మరియు ఆయన వారిపైకి పక్షుల గుంపులను పంపాడు;
                                                                        అవి (ఆ పక్షులు) వారి మీద మట్టితో చేసి కాల్చిన కంకర రాళ్ళను (సిజ్జీల్) విసురుతూ పోయాయి;
                                                                        ఆ విధంగా ఆయన వారిని (పశువులు) తినివేసిన పొట్టుగా మార్చి వేశాడు.