Surah Al-Qari'ah in తెలుగు
سورة القارعة · Verses: 11 · Meccan
Translation: తెలుగు translation (الترجمة التلجوية)
-
1
ٱلۡقَارِعَةُ
ఆ! అదరగొట్టే మహా ఉపద్రవం! -
2
مَا ٱلۡقَارِعَةُ
ఏమిటా అదరగొట్టే మహా ఉపద్రవం? -
3
وَمَآ أَدۡرَىٰكَ مَا ٱلۡقَارِعَةُ
మరియు ఆ అదరగొట్టే మహా ఉపద్రవం, అంటే ఏమిటో నీకేం తెలుసు? -
4
يَوۡمَ يَكُونُ ٱلنَّاسُ كَٱلۡفَرَاشِ ٱلۡمَبۡثُوثِ
ఆ రోజు మానవులు చెల్లాచెదురైన చిమ్మెటల వలే అయిపోతారు. -
5
وَتَكُونُ ٱلۡجِبَالُ كَٱلۡعِهۡنِ ٱلۡمَنفُوشِ
మరియు పర్వతాలు రంగు రంగుల ఏకిన దూది వలే అయి పోతాయి. -
6
فَأَمَّا مَن ثَقُلَتۡ مَوَٰزِينُهُۥ
అప్పుడు ఎవడి త్రాసుపళ్ళాలు (సత్కార్యాలతో) బరువుగా ఉంటాయో! -
7
فَهُوَ فِي عِيشَةࣲ رَّاضِيَةࣲ
అతడు (స్వర్గంలో) సుఖవంతమైన జీవితం గడుపుతాడు. -
8
وَأَمَّا مَنۡ خَفَّتۡ مَوَٰزِينُهُۥ
మరియు ఎవడి (సత్కార్యాల) త్రాసు పళ్ళాలు తేలికగా ఉంటాయో! -
9
فَأُمُّهُۥ هَاوِيَةࣱ
అతని నివాసం అధః పాతాళమే. -
10
وَمَآ أَدۡرَىٰكَ مَا هِيَهۡ
మరియు అది ఏమిటో నీకేం తెలుసు? -
11
نَارٌ حَامِيَةُۢ
అదొక భగభగమండే అగ్ని (గుండం).