Surah An-Naba' in తెలుగు
سورة النبأ · Verses: 40 · Meccan
Translation: తెలుగు translation (الترجمة التلجوية)
-
1
عَمَّ يَتَسَآءَلُونَ
ఏ విషయాన్ని గురించి వారు (ఒకరినొకరు) ప్రశ్నించుకుంటున్నారు? -
2
عَنِ ٱلنَّبَإِ ٱلۡعَظِيمِ
ఆ మహా వార్తను గురించేనా? -
3
ٱلَّذِي هُمۡ فِيهِ مُخۡتَلِفُونَ
దేనిని గురించైతే వారు భేదాభిప్రాయాలను కలిగి ఉన్నారో? -
4
كَلَّا سَيَعۡلَمُونَ
అది కాదు! వారు త్వరలోనే దానిని తెలుసుకోగలరు. -
5
ثُمَّ كَلَّا سَيَعۡلَمُونَ
ఎంత మాత్రము కాదు! వారు త్వరలోనే దానిని తెలుసుకోగలరు. -
6
أَلَمۡ نَجۡعَلِ ٱلۡأَرۡضَ مِهَٰدࣰا
ఏమీ? మేము భూమిని పరుపుగా చేయలేదా? -
7
وَٱلۡجِبَالَ أَوۡتَادࣰا
మరియు పర్వతాలను మేకులుగా? -
8
وَخَلَقۡنَٰكُمۡ أَزۡوَٰجࣰا
మరియు మేము మిమ్మల్ని (స్త్రీ-పురుషుల) జంటలుగా సృష్టించాము. -
9
وَجَعَلۡنَا نَوۡمَكُمۡ سُبَاتࣰا
మరియు మేము నిద్రను, మీకు విశ్రాంతి నిచ్చేదిగా చేశాము. -
10
وَجَعَلۡنَا ٱلَّيۡلَ لِبَاسࣰا
మరియు రాత్రిని ఆచ్ఛాదనగా చేశాము. -
11
وَجَعَلۡنَا ٱلنَّهَارَ مَعَاشࣰا
మరియు పగటిని జీవనోపాధి సమయంగా చేశాము. -
12
وَبَنَيۡنَا فَوۡقَكُمۡ سَبۡعࣰا شِدَادࣰا
మరియు మేము మీపైన పటిష్టమైన ఏడు (ఆకాశాలను) నిర్మించాము. -
13
وَجَعَلۡنَا سِرَاجࣰا وَهَّاجࣰا
మరియు (అందులో) ప్రకాశించే దీపాన్ని (సూర్యుణ్ణి) ఉంచాము. -
14
وَأَنزَلۡنَا مِنَ ٱلۡمُعۡصِرَٰتِ مَآءࣰ ثَجَّاجࣰا
మరియు మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపించాము. -
15
لِّنُخۡرِجَ بِهِۦ حَبࣰّا وَنَبَاتࣰا
దానితో మేము ధాన్యం మరియు పచ్చికను (చెట్లు చేమలను) పెరిగించటానికి! -
16
وَجَنَّٰتٍ أَلۡفَافًا
మరియు దట్టమైన తోటలను. -
17
إِنَّ يَوۡمَ ٱلۡفَصۡلِ كَانَ مِيقَٰتࣰا
నిశ్చయంగా, తీర్పుదినం ఒక నిర్ణీత సమయం. -
18
يَوۡمَ يُنفَخُ فِي ٱلصُّورِ فَتَأۡتُونَ أَفۡوَاجࣰا
ఆ రోజు బాకా ఊదబడినప్పుడు! అప్పుడు మీరంతా గుంపులు గుంపులుగా లేచి వస్తారు. -
19
وَفُتِحَتِ ٱلسَّمَآءُ فَكَانَتۡ أَبۡوَٰبࣰا
మరియు ఆకాశం తెరువబడుతుంది, అందులో ద్వారాలు ఏర్పడుతాయి; -
20
وَسُيِّرَتِ ٱلۡجِبَالُ فَكَانَتۡ سَرَابًا
మరియు పర్వతాలు ఎండమావులుగా అదృశ్యమై పోతాయి. -
21
إِنَّ جَهَنَّمَ كَانَتۡ مِرۡصَادࣰا
నిశ్చయంగా, నరకం ఒక మాటు; -
22
لِّلطَّٰغِينَ مَـَٔابࣰا
ధిక్కారుల గమ్యస్థానం; -
23
لَّٰبِثِينَ فِيهَآ أَحۡقَابࣰا
అందులో వారు యుగాల తరబడి ఉంటారు. -
24
لَّا يَذُوقُونَ فِيهَا بَرۡدࣰا وَلَا شَرَابًا
అందులో వారు ఎలాంటి చల్లదనాన్ని గానీ మరియు (చల్లని) పానీయాన్ని గానీ చవి చూడరు. -
25
إِلَّا حَمِيمࣰا وَغَسَّاقࣰا
సలసల కాగే నీరు మరియు చీము లాంటి మురికి (పానీయం) తప్ప! -
26
جَزَآءࣰ وِفَاقًا
(వారి కర్మలకు) తగిన పూర్తి ప్రతిఫలంగా! -
27
إِنَّهُمۡ كَانُواْ لَا يَرۡجُونَ حِسَابࣰا
వాస్తవానికి వారు లెక్క తీసుకోబడుతుందని ఆశించలేదు. -
28
وَكَذَّبُواْ بِـَٔايَٰتِنَا كِذَّابࣰا
పైగా వారు మా సూచనలను (ఆయాత్ లను) అసత్యాలని తిరస్కరించారు. -
29
وَكُلَّ شَيۡءٍ أَحۡصَيۡنَٰهُ كِتَٰبࣰا
మరియు మేము (వారు చేసిన) ప్రతిదానిని ఒక పుస్తకంలో వ్రాసి పెట్టాము. -
30
فَذُوقُواْ فَلَن نَّزِيدَكُمۡ إِلَّا عَذَابًا
కావున మీరు (మీ కర్మల ఫలితాన్ని) చవి చూడండి. ఎందుకంటే, మేము మీకు శిక్ష తప్ప మరేమీ అధికం చేయము. -
31
إِنَّ لِلۡمُتَّقِينَ مَفَازًا
నిశ్చయంగా, దైవభీతి గలవారికి సాఫల్యం (స్వర్గం) ఉంది; -
32
حَدَآئِقَ وَأَعۡنَٰبࣰا
ఉద్యానవనాలూ, ద్రాక్ష తోటలూ! -
33
وَكَوَاعِبَ أَتۡرَابࣰا
మరియు ఈడూజోడూ గల (యవ్వన) సుందర కన్యలు; -
34
وَكَأۡسࣰا دِهَاقࣰا
మరియు నిండి పొర్లే (మధు) పాత్ర -
35
لَّا يَسۡمَعُونَ فِيهَا لَغۡوࣰا وَلَا كِذَّٰبࣰا
అందులో (స్వర్గంలో) వారు ఎలాంటి వ్యర్థపు మాటలు గానీ, అసత్యాలు గానీ వినరు. -
36
جَزَآءࣰ مِّن رَّبِّكَ عَطَآءً حِسَابࣰا
(ఇదంతా) నీ ప్రభువు తరఫు నుండి లభించే ప్రతిఫలం, చాలినంత బహుమానం. -
37
رَّبِّ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ وَمَا بَيۡنَهُمَا ٱلرَّحۡمَٰنِۖ لَا يَمۡلِكُونَ مِنۡهُ خِطَابࣰا
భూమ్యాకాశాలు మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికీ ప్రభువైన అనంత కరుణామయుని (బహుమానం), ఆయన ముందు మాట్లాడే సాహసం ఎవ్వరికీ లేదు. -
38
يَوۡمَ يَقُومُ ٱلرُّوحُ وَٱلۡمَلَٰٓئِكَةُ صَفࣰّاۖ لَّا يَتَكَلَّمُونَ إِلَّا مَنۡ أَذِنَ لَهُ ٱلرَّحۡمَٰنُ وَقَالَ صَوَابࣰا
ఏ రోజునయితే ఆత్మ (జిబ్రీల్) మరియు దేవదూతలు వరుసలలో నిలిచి ఉంటారో! అప్పుడు ఆ అనంత కరుణామయుడు అనుమతించిన వాడు తప్ప, మరెవ్వరూ మాట్లాడలేరు; ఒకవేళ ఎవడైనా మాట్లాడినా అతడు సరైన మాటే మాట్లాడుతాడు. -
39
ذَٰلِكَ ٱلۡيَوۡمُ ٱلۡحَقُّۖ فَمَن شَآءَ ٱتَّخَذَ إِلَىٰ رَبِّهِۦ مَـَٔابًا
అదే అంతిమ సత్యదినం. కావున ఇష్టమున్నవాడు, తన ప్రభువు వైపునకు చేరే మార్గాన్ని అవలంబించాలి! -
40
إِنَّآ أَنذَرۡنَٰكُمۡ عَذَابࣰا قَرِيبࣰا يَوۡمَ يَنظُرُ ٱلۡمَرۡءُ مَا قَدَّمَتۡ يَدَاهُ وَيَقُولُ ٱلۡكَافِرُ يَٰلَيۡتَنِي كُنتُ تُرَٰبَۢا
నిశ్చయంగా, మేము అతని సమీపంలో ఉన్న శిక్షను గురించి మిమ్మల్ని హెచ్చరించాము. ఆ రోజు ప్రతి మనిషి తన చేజేతులా చేసుకొని ముందు పంపుకున్నదంతా ప్రత్యక్షంగా చూసుకుంటాడు. మరియు సత్యతిరస్కారి: "అయ్యో! నా పాడుగాను! నేను మట్టినయి ఉంటే ఎంత బాగుండేది!" అని వాపోతాడు.