Surah Ad-Duha in తెలుగు
سورة الضحى · Verses: 11 · Meccan
Translation: తెలుగు translation (الترجمة التلجوية)
-
1
وَٱلضُّحَىٰ
ప్రకాశవంతమైన ప్రొద్దుటి పూట (పూర్వాహ్ణం) సాక్షిగా! -
2
وَٱلَّيۡلِ إِذَا سَجَىٰ
మరియు చీకటి పడ్డ రాత్రి సాక్షిగా! -
3
مَا وَدَّعَكَ رَبُّكَ وَمَا قَلَىٰ
(ఓ ముహమ్మద్!) నీ ప్రభువు, నిన్ను త్యజించనూ లేదు మరియు నిన్ను ఉపేక్షించనూ లేదు. -
4
وَلَلۡأٓخِرَةُ خَيۡرࣱ لَّكَ مِنَ ٱلۡأُولَىٰ
మరియు రాబోయే కాలం (జీవితం) నీ కొరకు మొదటి కాలం (జీవితం) కంటే ఎంతో మేలైనది! -
5
وَلَسَوۡفَ يُعۡطِيكَ رَبُّكَ فَتَرۡضَىٰٓ
మరియు త్వరలోనే నీ ప్రభువు నీకు (నీవు కోరేది) ప్రసాదిస్తాడు. దానితో నీవు సంతోషపడతావు. -
6
أَلَمۡ يَجِدۡكَ يَتِيمࣰا فَـَٔاوَىٰ
(ఓ ముహమ్మద్!) ఏమీ? నిన్ను అనాథునిగా చూసి, ఆయన (అల్లాహ్) నీకు ఆశ్రయం కల్పించలేదా? -
7
وَوَجَدَكَ ضَآلࣰّا فَهَدَىٰ
మరియు నీకు మార్గం తోచనప్పుడు, ఆయన నీకు మార్గదర్శకత్వం చేయలేదా? -
8
وَوَجَدَكَ عَآئِلࣰا فَأَغۡنَىٰ
మరియు ఆయన, పేదవానిగా చూసి, నిన్ను సంపన్నుడిగా చేయలేదా? -
9
فَأَمَّا ٱلۡيَتِيمَ فَلَا تَقۡهَرۡ
కాబట్టి నీవు అనాథుల పట్ల కఠినంగా ప్రవర్తించకు; -
10
وَأَمَّا ٱلسَّآئِلَ فَلَا تَنۡهَرۡ
మరియు యాచకుణ్ణి కసరుకోకు; -
11
وَأَمَّا بِنِعۡمَةِ رَبِّكَ فَحَدِّثۡ
మరియు నీ ప్రభువు అనుగ్రహాలను బహిరంగంగా ప్రకటిస్తూ ఉండు.