Surah Al-Lail in తెలుగు
سورة الليل · Verses: 21 · Meccan
Translation: తెలుగు translation (الترجمة التلجوية)
-
1
وَٱلَّيۡلِ إِذَا يَغۡشَىٰ
క్రమ్ముకునే రాత్రి సాక్షిగా! -
2
وَٱلنَّهَارِ إِذَا تَجَلَّىٰ
ప్రకాశించే పగటి సాక్షిగా! -
3
وَمَا خَلَقَ ٱلذَّكَرَ وَٱلۡأُنثَىٰٓ
మరియు, మగ మరియు ఆడ (జాతులను) సృష్టించిన ఆయన (అల్లాహ్) సాక్షిగా! -
4
إِنَّ سَعۡيَكُمۡ لَشَتَّىٰ
వాస్తవానికి, మీ ప్రయత్నాలు నానా విధాలుగా ఉన్నాయి; -
5
فَأَمَّا مَنۡ أَعۡطَىٰ وَٱتَّقَىٰ
కాని ఎవడైతే (దానధర్మాలు) చేస్తూ దైవభీతి కలిగి ఉంటాడో! -
6
وَصَدَّقَ بِٱلۡحُسۡنَىٰ
మరియు మంచిని నమ్ముతాడో! -
7
فَسَنُيَسِّرُهُۥ لِلۡيُسۡرَىٰ
అతనికి మేము మేలు కొరకు దానిరి సులభం చేస్తాము. -
8
وَأَمَّا مَنۢ بَخِلَ وَٱسۡتَغۡنَىٰ
కాని ఎవడైతే పిసినారితనం చేస్తూ, నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తాడో! -
9
وَكَذَّبَ بِٱلۡحُسۡنَىٰ
మరియు మంచిని అబద్ధమని తిరస్కరిస్తాడో! -
10
فَسَنُيَسِّرُهُۥ لِلۡعُسۡرَىٰ
అతనికి మేము చెడు కొరకు దారిని సులభం చేస్తాము. -
11
وَمَا يُغۡنِي عَنۡهُ مَالُهُۥٓ إِذَا تَرَدَّىٰٓ
మరియు అతడు నశించి పోయినప్పుడు, అతని ధనం అతనికి ఎలా ఉపయోగపడుతుంది? -
12
إِنَّ عَلَيۡنَا لَلۡهُدَىٰ
నిశ్చయంగా, సన్మార్గం చూపడం మా పని! -
13
وَإِنَّ لَنَا لَلۡأٓخِرَةَ وَٱلۡأُولَىٰ
మరియు నిశ్చయంగా, ఇహపరలోకాల (ఆధిపత్యం) మాకే చెందినది. -
14
فَأَنذَرۡتُكُمۡ نَارࣰا تَلَظَّىٰ
కాబట్టి నేను మిమ్మల్ని ప్రజ్వలించే నరకాగ్నిని గురించి హెచ్చరించాను. -
15
لَا يَصۡلَىٰهَآ إِلَّا ٱلۡأَشۡقَى
పరమ దౌర్భాగ్యుడు తప్ప, మరెవ్వడూ అందులో కాలడు! -
16
ٱلَّذِي كَذَّبَ وَتَوَلَّىٰ
ఎవడైతే (సత్యాన్ని) తిరస్కరించి (దాని నుండి) విముఖుడవుతాడో! -
17
وَسَيُجَنَّبُهَا ٱلۡأَتۡقَى
కాని దైవభీతి గలవాడు దాని నుండి (ఆ నరకాగ్ని నుండి) దూరంగా ఉంచబడతాడు! -
18
ٱلَّذِي يُؤۡتِي مَالَهُۥ يَتَزَكَّىٰ
అతడే! ఎవడైతే, పవిత్రుడవటానికి తన ధనం నుండి (ఇతరులకు) ఇస్తాడో! -
19
وَمَا لِأَحَدٍ عِندَهُۥ مِن نِّعۡمَةࣲ تُجۡزَىٰٓ
కాని అది, వారు అతనికి చేసిన ఏ ఉపకారానికి బదులుగా గాక; -
20
إِلَّا ٱبۡتِغَآءَ وَجۡهِ رَبِّهِ ٱلۡأَعۡلَىٰ
కేవలం మహోన్నతుడైన తన ప్రభువు ప్రసన్నతను పొందటానికి మాత్రమే అయితే! -
21
وَلَسَوۡفَ يَرۡضَىٰ
మరియు అలాంటి వాడే తప్పక సంతోషిస్తాడు.