Surah At-Tin in తెలుగు
سورة التين · Verses: 8 · Meccan
Translation: తెలుగు translation (الترجمة التلجوية)
-
1
وَٱلتِّينِ وَٱلزَّيۡتُونِ
అంజూరం (అత్తిపండు) మరియు జైతూన్ సాక్షిగా! -
2
وَطُورِ سِينِينَ
సీనాయ్ (తూర్) కొండ సాక్షిగా! -
3
وَهَٰذَا ٱلۡبَلَدِ ٱلۡأَمِينِ
ఈ శాంతి నగరం (మక్కా) సాక్షిగా! -
4
لَقَدۡ خَلَقۡنَا ٱلۡإِنسَٰنَ فِيٓ أَحۡسَنِ تَقۡوِيمࣲ
వాస్తవంగా! మేము మానవుడిని సర్వశ్రేష్ఠమైన ఆకారంలో సృష్టించాము. -
5
ثُمَّ رَدَدۡنَٰهُ أَسۡفَلَ سَٰفِلِينَ
తరువాత మేము అతన్ని దిగజార్చి అధమాతి - అధమమైన స్థితికి మార్చాము. -
6
إِلَّا ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ فَلَهُمۡ أَجۡرٌ غَيۡرُ مَمۡنُونࣲ
కాని విశ్వసించి, సత్కార్యాలు చేసేవారు తప్ప! ఎందుకంటే అలాంటి వారికి అంతులేని ప్రతిఫలం ఉంది. -
7
فَمَا يُكَذِّبُكَ بَعۡدُ بِٱلدِّينِ
అయితే (ఓ మానవుడా!) దీని తరువాత కూడా నీవు ఎందుకు ప్రతిఫలదినాన్ని తిరస్కరిస్తున్నావు? -
8
أَلَيۡسَ ٱللَّهُ بِأَحۡكَمِ ٱلۡحَٰكِمِينَ
ఏమీ? అల్లాహ్ న్యాయాధిపతులలోకెల్లా సర్వోత్తమ న్యాయాధిపతి కాడా?