Surah Al-'Alaq in తెలుగు
سورة العلق · Verses: 19 · Meccan
Translation: తెలుగు translation (الترجمة التلجوية)
-
1
ٱقۡرَأۡ بِٱسۡمِ رَبِّكَ ٱلَّذِي خَلَقَ
చదువు! నీ ప్రభువు పేరుతో, ఆయనే (సర్వాన్ని) సృష్టించాడు! -
2
خَلَقَ ٱلۡإِنسَٰنَ مِنۡ عَلَقٍ
ఆయనే మానవుణ్ణి రక్తముద్దతో (జీవకణంతో) సృష్టించాడు. -
3
ٱقۡرَأۡ وَرَبُّكَ ٱلۡأَكۡرَمُ
చదువు! మరియు నీ ప్రభువు పరమదాత. -
4
ٱلَّذِي عَلَّمَ بِٱلۡقَلَمِ
ఆయన కలం ద్వారా నేర్పాడు. -
5
عَلَّمَ ٱلۡإِنسَٰنَ مَا لَمۡ يَعۡلَمۡ
మానవుడు ఎరుగని జ్ఞానాన్ని అతనికి బోధించాడు. -
6
كَلَّآ إِنَّ ٱلۡإِنسَٰنَ لَيَطۡغَىٰٓ
అలా కాదు! వాస్తవానికి, మానవుడు తలబిరుసుతనంతో ప్రవర్తిస్తాడు. -
7
أَن رَّءَاهُ ٱسۡتَغۡنَىٰٓ
ఎందుకంటే, అతడు తనను తాను నిరపేక్షాపరుడిగా భావిస్తాడు. -
8
إِنَّ إِلَىٰ رَبِّكَ ٱلرُّجۡعَىٰٓ
నిశ్చయంగా నీ ప్రభువు వైపునకే (అందరికీ) మరలి పోవలసి ఉంది. -
9
أَرَءَيۡتَ ٱلَّذِي يَنۡهَىٰ
నీవు నిరోధించే వ్యక్తిని చూశావా? -
10
عَبۡدًا إِذَا صَلَّىٰٓ
నమాజ్ చేసే (అల్లాహ్) దాసుణ్ణి? -
11
أَرَءَيۡتَ إِن كَانَ عَلَى ٱلۡهُدَىٰٓ
ఒకవేళ అతను (ముహమ్మద్!) సన్మార్గంపై ఉంటే నీ అభిప్రాయమేమిటి? -
12
أَوۡ أَمَرَ بِٱلتَّقۡوَىٰٓ
ఇంకా, దైవభీతిని గురించి ఆదేశిస్తూ ఉంటే? -
13
أَرَءَيۡتَ إِن كَذَّبَ وَتَوَلَّىٰٓ
ఒకవేళ (ఆ నిరోధించే) వాడు సత్యాన్ని తిరస్కరించేవాడు మరియు సన్మార్గం నుండి విముఖుడయ్యేవాడైతే? -
14
أَلَمۡ يَعۡلَم بِأَنَّ ٱللَّهَ يَرَىٰ
వాస్తవానికి, అల్లాహ్ అంతా చూస్తున్నాడని అతనికి తెలియదా? -
15
كَلَّا لَئِن لَّمۡ يَنتَهِ لَنَسۡفَعَۢا بِٱلنَّاصِيَةِ
అలా కాదు! ఒకవేళ అతడు మానుకోకపోతే, మేము అతడిని, నుదుటి జుట్టు వెంట్రుకలను పట్టి ఈడుస్తాము. -
16
نَاصِيَةࣲ كَٰذِبَةٍ خَاطِئَةࣲ
అది అబద్ధాలలో, అపరాధాలలో మునిగివున్న నుదురు! -
17
فَلۡيَدۡعُ نَادِيَهُۥ
అయితే, అతన్ని తన అనుచరులను పిలుచుకోమను! -
18
سَنَدۡعُ ٱلزَّبَانِيَةَ
మేము కూడా నరక దూతలను పిలుస్తాము! -
19
كَلَّا لَا تُطِعۡهُ وَٱسۡجُدۡۤ وَٱقۡتَرِب۩
అలా కాదు! నీవు అతని మాట వినకు మరియు ఆయనే (అల్లాహ్ కే) సాష్టాంగం (సజ్దా) చెయ్యి మరియు ఆయన (అల్లాహ్) సాన్నిధ్యాన్ని పొందటానికి ప్రయత్నించు!