ﰁ
                    surah.translation
            .
            
    
                                    من تأليف: 
                                             مولانا عبد الرحيم بن محمد
                                                            .
                                                
            ﰡ
ఆకాశం బ్రద్దలయి పోయినప్పుడు!
                                                                        మరియు అది తన ప్రభువు ఆదేశపాలన చేసింది మరియు అదే దాని విధ్యుక్త ధర్మం.
                                                                        మరియు భూమి విస్తరింపజేయబడి (చదునుగా చేయబడి) నప్పుడు;
                                                                        మరియు అది తన లోపల ఉన్నదంతా బయటికి విసరివేసి, ఖాళీ అయినప్పుడు;
                                                                        అది తన ప్రభువు ఆదేశపాలన చేసింది మరియు అదే దాని విధ్యుక్త ధర్మం.
                                                                        ఓ మానవుడా! నిశ్చయంగా, నీవు నీ ప్రభువు వైపునకు, నీ (మంచి-చెడు) కర్మలను తీసుకొని మరలుతున్నావు, ఒక నిశ్చిత మరల్పు. అప్పుడు నీవు నీ (కర్మల ఫలితాన్ని) పొందుతావు.
                                                                        అప్పుడు తన కర్మపత్రం కుడిచేతిలో ఇవ్వబడినవాడి నుండి;
                                                                        అతని లెక్క అతి తేలికగా తీసుకోబడగలదు.
                                                                        మరియు అతడు సంతోషంగా తన వారి దగ్గరకు మరలిపోతాడు!
                                                                        ఇక తన కర్మపత్రం వీపు వెనుక నుండి ఇవ్వబడినవాడు;
                                                                        అప్పుడతడు తన నాశనాన్నే - కోరుకుంటాడు;
                                                                        
                                                                                                                
                                    ﮜﮝ
                                    ﰋ
                                                                        
                    మరియు అతడు మండుతున్న నరకాగ్నిలో పడిపోతాడు.
                                                                        వాస్తవానికి, అతడు (ప్రపంచంలో) తన వారి మధ్య సుఖసంతోషాలలో మునిగి ఉండేవాడు.
                                                                        వాస్తవానికి, అతడు (మా వైపుకు) మరలిరాడని భావించేవాడు.
                                                                        అలా కాదు! వాస్తవానికి, అతని ప్రభువు అతనిని గమనిస్తూ ఉండేవాడు.
                                                                        కనుక, నేను సంధ్యకాలపు ఎరుపు సాక్షిగా చెబుతున్నాను!
                                                                        రాత్రి సాక్షిగా, అది ప్రోగు చేసేవాటి సాక్షిగా!
                                                                        పూర్ణచంద్రుని సాక్షిగా!
                                                                        మీరందరూ తప్పనిసరిగా ఒక స్థితి నుండి మరొక స్థితికి క్రమక్రమంగా మారుతూ పోవలసి ఉంటుంది.
                                                                        అయితే వీరి కేమయింది? వీరు ఎందుకు విశ్వసించరు?
                                                                        మరియు ఖుర్ఆన్ వీరి ముందు పఠింపబడినప్పుడు వీరెందుకు సాష్టాంగం (సజ్దా) చేయరు?
                                                                        అలా కాదు! ఈ సత్యతిరస్కారులు దీనిని అసత్యమంటున్నారు.
                                                                        మరియు వారు కూడబెట్టేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు.
                                                                        కాబట్టి వారికి (పరలోకంలో) లభించే వ్యధాభరితమైన శిక్ష యొక్క వార్తనివ్వు - 
                                                                        విశ్వసించి సత్కార్యాలు చేసే వారికి తప్ప - వారికి ఎన్నటికీ అంతం గాని ప్రతిఫలం ఉంటుంది.