surah.translation .
من تأليف: مولانا عبد الرحيم بن محمد .

వగర్చుతూ పరిగెత్తే గుర్రాల సాక్షిగా!
తమ ఖురాల తట్టులతో అగ్నికణాలు లేపేవాటి;
తెల్లవారుఝామున దాడి చేసేవాటి;
(మేఘాల వంటి) దుమ్ము లేపుతూ;
(శత్రువుల) సమూహంలో దూరిపోయే వాటి.
నిశ్చయంగా, మానవుడు తన ప్రభువు పట్ల ఎంతో కృతఘ్నుడు.
మరియు నిశ్చయంగా, దీనికి స్వయంగా అతడే సాక్షి.
మరియు నిశ్చయంగా, అతడు సిరిసంపదల వ్యామోహంలో పూర్తిగా మునిగి ఉన్నాడు.
ఏమిటి? అతనికి తెలియదా? గోరీలలో ఉన్నదంతా పెళ్ళగించి బయటికి తీయబడినప్పుడు;
మరియు (మానవుల) హృదయాలలోని విషయాలన్నీ వెల్లడి చేయబడినప్పుడు;
నిశ్చయంగా, ఆ రోజున వారి ప్రభువు వారిని గురించి అంతా తెలుసుకొని ఉంటాడని!