سورة الهمزة

الترجمة التلجوية

الترجمة التلجوية నుండి التلجوية లో సూరా الهمزة యొక్క అనువాదం

الترجمة التلجوية

الناشر

مجمع الملك فهد

Verse 1
అపనిందలు మోపే, చాడీలు చెప్పే ప్రతి ఒక్కడికీ వినాశం తప్పదు.
Verse 2
ఎవడైతే ధనాన్ని కూడబెట్టి, మాటి మాటికి దాన్ని లెక్కబెడుతూ ఉంటాడో!
Verse 3
తన ధనం, తనను శాశ్వతంగా ఉంచుతుందని అతడు భావిస్తున్నాడు!
ఎంత మాత్రం కాదు! అతడు (రాబోయే జీవితంలో) తప్పకుండా అణగ ద్రొక్కబడే నరకాగ్నిలో వేయబడతాడు.
Verse 5
ఆ (అణగద్రొక్కబడే) నరకాగ్ని అంటే ఏమిటో నీకు తెలుసా?
Verse 6
అల్లాహ్, తీవ్రంగా ప్రజ్వలింపజేసిన అగ్ని;
Verse 7
అది గుండెల దాకా చేరుకుంటుంది.
Verse 8
నిశ్చయంగా, అది వారి మీద క్రమ్ముకొంటుంది.
Verse 9
పొడుగాటి (అగ్ని) స్థంభాల వలే!
تقدم القراءة