surah.translation .
من تأليف: مولانا عبد الرحيم بن محمد .

ప్రకాశవంతమైన ప్రొద్దుటి పూట (పూర్వాహ్ణం) సాక్షిగా!
మరియు చీకటి పడ్డ రాత్రి సాక్షిగా!
(ఓ ముహమ్మద్!) నీ ప్రభువు, నిన్ను త్యజించనూ లేదు మరియు నిన్ను ఉపేక్షించనూ లేదు.
మరియు రాబోయే కాలం (జీవితం) నీ కొరకు మొదటి కాలం (జీవితం) కంటే ఎంతో మేలైనది!
మరియు త్వరలోనే నీ ప్రభువు నీకు (నీవు కోరేది) ప్రసాదిస్తాడు. దానితో నీవు సంతోషపడతావు.
(ఓ ముహమ్మద్!) ఏమీ? నిన్ను అనాథునిగా చూసి, ఆయన (అల్లాహ్) నీకు ఆశ్రయం కల్పించలేదా?
మరియు నీకు మార్గం తోచనప్పుడు, ఆయన నీకు మార్గదర్శకత్వం చేయలేదా?
మరియు ఆయన, పేదవానిగా చూసి, నిన్ను సంపన్నుడిగా చేయలేదా?
కాబట్టి నీవు అనాథుల పట్ల కఠినంగా ప్రవర్తించకు;
మరియు యాచకుణ్ణి కసరుకోకు;
మరియు నీ ప్రభువు అనుగ్రహాలను బహిరంగంగా ప్రకటిస్తూ ఉండు.