الترجمة التلجوية నుండి التلجوية లో సూరా الليل యొక్క అనువాదం
Verse 1
ﮡﮢﮣ
ﮤ
క్రమ్ముకునే రాత్రి సాక్షిగా!
Verse 2
ﮥﮦﮧ
ﮨ
ప్రకాశించే పగటి సాక్షిగా!
Verse 3
ﮩﮪﮫﮬ
ﮭ
మరియు, మగ మరియు ఆడ (జాతులను) సృష్టించిన ఆయన (అల్లాహ్) సాక్షిగా!
Verse 4
ﮮﮯﮰ
ﮱ
వాస్తవానికి, మీ ప్రయత్నాలు నానా విధాలుగా ఉన్నాయి;
Verse 5
ﯓﯔﯕﯖ
ﯗ
కాని ఎవడైతే (దానధర్మాలు) చేస్తూ దైవభీతి కలిగి ఉంటాడో!
Verse 6
ﯘﯙ
ﯚ
మరియు మంచిని నమ్ముతాడో!
Verse 7
ﯛﯜ
ﯝ
అతనికి మేము మేలు కొరకు దానిరి సులభం చేస్తాము.
Verse 8
ﯞﯟﯠﯡ
ﯢ
కాని ఎవడైతే పిసినారితనం చేస్తూ, నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తాడో!
Verse 9
ﯣﯤ
ﯥ
మరియు మంచిని అబద్ధమని తిరస్కరిస్తాడో!
Verse 10
ﭑﭒ
ﭓ
అతనికి మేము చెడు కొరకు దారిని సులభం చేస్తాము.
Verse 11
ﭔﭕﭖﭗﭘﭙ
ﭚ
మరియు అతడు నశించి పోయినప్పుడు, అతని ధనం అతనికి ఎలా ఉపయోగపడుతుంది?
Verse 12
ﭛﭜﭝ
ﭞ
నిశ్చయంగా, సన్మార్గం చూపడం మా పని!
Verse 13
ﭟﭠﭡﭢ
ﭣ
మరియు నిశ్చయంగా, ఇహపరలోకాల (ఆధిపత్యం) మాకే చెందినది.
Verse 14
ﭤﭥﭦ
ﭧ
కాబట్టి నేను మిమ్మల్ని ప్రజ్వలించే నరకాగ్నిని గురించి హెచ్చరించాను.
Verse 15
ﭨﭩﭪﭫ
ﭬ
పరమ దౌర్భాగ్యుడు తప్ప, మరెవ్వడూ అందులో కాలడు!
Verse 16
ﭭﭮﭯ
ﭰ
ఎవడైతే (సత్యాన్ని) తిరస్కరించి (దాని నుండి) విముఖుడవుతాడో!
Verse 17
ﭱﭲ
ﭳ
కాని దైవభీతి గలవాడు దాని నుండి (ఆ నరకాగ్ని నుండి) దూరంగా ఉంచబడతాడు!
Verse 18
ﭴﭵﭶﭷ
ﭸ
అతడే! ఎవడైతే, పవిత్రుడవటానికి తన ధనం నుండి (ఇతరులకు) ఇస్తాడో!
Verse 19
ﭹﭺﭻﭼﭽﭾ
ﭿ
కాని అది, వారు అతనికి చేసిన ఏ ఉపకారానికి బదులుగా గాక;
Verse 20
ﮀﮁﮂﮃﮄ
ﮅ
కేవలం మహోన్నతుడైన తన ప్రభువు ప్రసన్నతను పొందటానికి మాత్రమే అయితే!
Verse 21
ﮆﮇ
ﮈ
మరియు అలాంటి వాడే తప్పక సంతోషిస్తాడు.
تقدم القراءة