ﰓ
surah.translation
.
من تأليف:
مولانا عبد الرحيم بن محمد
.
ﰡ
ﮣﮤ
ﰀ
(ఇహలోక) పేరాస మిమ్మల్ని ఏమరుపాటులో పడవేసింది;
మీరు గోరీలలోకి చేరే వరకు.
అలా కాదు! త్వరలోనే మీరు తెలుసు కుంటారు.
మరొకసారి (వినండి)! వాస్తవంగా, మీరు అతి త్వరలోనే తెలుసుకుంటారు.
ఎంత మాత్రము కాదు! ఒకవేళ మీరు నిశ్చిత జ్ఞానంతో తెలుసుకొని ఉంటే (మీ వైఖరి ఇలా ఉండేది కాదు).
ﯚﯛ
ﰅ
నిశ్చయంగా, మీరు భగభగ మండే నరకాగ్నిని చూడగలరు!
మళ్ళీ అంటున్నాను! మీరు తప్పక దానిని (నరకాగ్నిని) నిస్సంకోచమైన దృష్టితో చూడగలరు!
అప్పుడు, ఆ రోజు మీరు (ఈ జీవితంలో అనుభవించిన) సౌఖ్యాలను గురించి తప్పక ప్రశ్నించబడతారు!