ترجمة معاني سورة التكوير
باللغة التلجوية من كتاب الترجمة التلجوية
.
من تأليف:
مولانا عبد الرحيم بن محمد
.
ﰡ
సూర్యుడు (అంధకారంలో) చుట్టి పోయబడి కాంతిహీనుడైనప్పుడు!
మరియు నక్షత్రాలు (కాంతిని కోల్పోయి) రాలిపోవునప్పుడు!
మరియు పర్వతాలు కదిలించబడినప్పుడు!
మరియు నిండు సూడి ఒంటెలు, నిరపేక్షంగా వదిలివేయబడినప్పుడు!
మరియు క్రూరమృగాలన్నీ ఒకచేట సమకూర్చబడినప్పుడు!
మరియు సముద్రాలు ఉప్పొంగిపోయి నప్పుడు!
మరియు ఆత్మలు (శరీరాలతో) తిరిగి కలుపబడి నప్పుడు!
మరియు సజీవంగా పాతి పెట్టబడిన బాలిక ప్రశ్నించబడినప్పుడు:
ఏ అపరాధానికి తాను హత్య చేయబడిందని?
మరియు కర్మపత్రాలు తెరువబడినప్పుడు!
మరియు ఆకాశం ఒలిచి వేయబడినప్పుడు!
మరియు నరకాగ్ని మండించబడినప్పుడు!
మరియు స్వర్గం దగ్గరకు తీసుకురాబడినప్పుడు!
ప్రతి ఆత్మ తాను చేసి తెచ్చిన కర్మలను తెలుసుకుంటుంది.
అలా కాదు! నేను తొలగిపోయే నక్షత్రాల సాక్షిగా చెబుతున్నాను;
ﮖﮗ
ﰏ
(ఏవైతే) వేగంగా తిరుగుతూ కనుమరుగవుతున్నాయో!
మరియు గడచి పోయే రాత్రి సాక్షిగా!
మరియు ప్రకాశించే ఉదయం సాక్షిగా!
నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) గౌరవనీయుడైన సందేశహరుడు తెచ్చిన వాక్కు!
అతను (జిబ్రీల్) మహా బలశాలి, సింహాసన (అర్ష్) అధిపతి సన్నిధిలో ఉన్నత స్థానం గలవాడు!
అతని ఆజ్ఞలు పాటింపబడతాయి మరియు (అతను) విశ్వసనీయుడు!
మరియు (ఓ ప్రజలారా!) మీ సహచరుడు పిచ్చివాడు కాడు!
మరియు వాస్తవంగా, అతను ఆ సందేశహరుణ్ణి (జిబ్రీల్ ను) ప్రకాశవంతమైన దిఙ్మండలంలో చూశాడు.
మరియు అతను (ముహమ్మద్) అగోచర జ్ఞానాన్ని ప్రజల నుండి దాచేవాడు కాడు.
మరియు ఇది (ఈ ఖుర్ఆన్) శపించ (బహిష్కరించ) బడిన షైతాన్ వాక్కు కాదు.
ﯧﯨ
ﰙ
మరి మీరు ఎటు పోతున్నారు?
ఇది (ఈ ఖుర్ఆన్) సర్వలోకాలకు ఒక హితోపదేశం.
మీలో, ఋజుమార్గంలో నడవ దలచుకున్న ప్రతివాని కొరకు.
మరియు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ తలచనంత వరకు, మీరు తలచినంత మాత్రాన ఏమీ కాదు.