ترجمة معاني سورة القيامة باللغة التلجوية من كتاب الترجمة التلجوية

مولانا عبد الرحيم بن محمد

الترجمة التلجوية

مولانا عبد الرحيم بن محمد

الناشر

مجمع الملك فهد

آية رقم 1
అలా కాదు! నేను పునరుత్థాన దినపు శపథం చేస్తున్నాను.
آية رقم 2
అలా కాదు! నేను తనను తాను నిందించుకునే అంతరాత్మ శపథం చేస్తున్నాను.
آية رقم 3
ఏమిటి? మేము అతని ఎముకలను ప్రోగు చేయలేమని మానవుడు భావిస్తున్నాడా?
آية رقم 4
వాస్తవానికి! మేము అతని వ్రేళ్ళ కొనలను గూడా సరిగ్గా సవరించగల సమర్ధులము.
آية رقم 5
అయినా, మానవుడు ఇక మీద కూడా దుష్కార్యాలు చేయగోరుతున్నాడు.
آية رقم 6
అతడు: "అయితే ఈ పునరుత్థాన దినం ఎప్పుడు వస్తుంది?" అని అడుగుతున్నాడు.
آية رقم 7
కళ్ళు మిరుమిట్లుగొన్నప్పుడు;
آية رقم 8
మరియు చంద్రునికి గ్రహణం పట్టినప్పుడు;
آية رقم 9
మరియు సూర్యచంద్రులు కలిపి వేయబడినప్పుడు;
آية رقم 10
మానవుడు ఆ రోజు: "ఎక్కడికి పారి పోవాలి?" అని అంటాడు.
آية رقم 11
అది కాదు! (అతనికి) ఎక్కడా శరణం ఉండదు!
آية رقم 12
ఆ రోజు నీ ప్రభువు వద్దనే ఆశ్రయం ఉంటుంది.
آية رقم 13
ఆ రోజు మానవుడికి, తాను చేసి పంపంది మరియు వెనక వదలింది అంతా తెలుపబడుతుంది.
آية رقم 14
అలా కాదు! మానవుడు తనకు విరుద్ధంగా, తానే సాక్షి అవుతాడు;
آية رقم 15
మరియు అతడు ఎన్ని సాకులు చెప్పినా సరే!
آية رقم 16
నీవు దీనిని (ఈ ఖుర్ఆన్ ను గ్రహించటానికి) నీ నాలుకను త్వరత్వరగా కదిలించకు.
آية رقم 17
నిశ్చయంగా, దీనిని సేకరించటం మరియు దీనిని చదివించటం మా బాధ్యతే!
آية رقم 18
కావున మేము దీనిని పఠించినప్పుడు నీవు ఆ పారాయణాన్ని శ్రద్ధగా అనుసరించు.
آية رقم 19
ఇక దాని భావాన్ని అర్థమయ్యేలా చేయటం మా బాధ్యతే!
آية رقم 20
అలా కాదు! వాస్తవానికి మీరు అనిశ్చితమైన (ఇహలోక జీవితం పట్ల) వ్యామోహం పెంచుకుంటున్నారు;
آية رقم 21
మరియు పరలోక జీవితాన్ని వదలి పెడుతున్నారు!
آية رقم 22
ఆ రోజున కొన్ని ముఖాలు కళకళ లాడుతూ ఉంటాయి;
آية رقم 23
తమ ప్రభువు (అల్లాహ్) వైపునకు చూస్తూ ఉంటాయి;
آية رقم 24
మరికొన్ని ముఖాలు ఆ రోజు, కాంతిహీనమై ఉంటాయి;
آية رقم 25
నడుమును విరిచే బాధ వారికి కలుగుతుందని భావించి.
آية رقم 26
అలా కాదు! ప్రాణం గొంతులోకి వచ్చినపుడు;
آية رقم 27
మరియు: "ఎవడైనా ఉన్నాడా? అతనిని (మరణం నుండి) కాపాడటానికి?" అని అనబడుతుంది.
آية رقم 28
మరియు అప్పుడతడు వాస్తవానికి తన ఎడబాటు కాలం వచ్చిందని గ్రహిస్తాడు;
آية رقم 29
మరియు ఒక పిక్క మరొక పిక్కతో కలిసిపోతుంది.
آية رقم 30
ఆ రోజు నీ ప్రభువు వైపునకే ప్రయాణం ఉంటుంది!
آية رقم 31
కాని అతడు సత్యాన్ని నమ్మలేదు మరియు నమాజ్ సలపనూ లేదు!
آية رقم 32
మరియు అతడు (ఈ సందేశాన్ని) అసత్యమన్నాడు మరియు దాని నుండి వెనుదిరిగాడు!
آية رقم 33
ఆ తరువాత నిక్కుతూ నీల్గుతూ తన ఇంటివారి వద్దకు పోయాడు!
آية رقم 34
(ఓ సత్యతిరస్కారుడా!) నీకు నాశనం మీద నాశనం రానున్నది!
آية رقم 35
అవును, నీకు నాశనం మీద నాశనం రానున్నది!
آية رقم 36
ఏమిటీ? మానవుడు తనను విచ్చల విడిగా వదలిపెట్టండం జరుగుతుందని భావిస్తున్నాడా?
آية رقم 37
ఏమీ? అతడు ప్రసరింప జేయబడిన ఒక వీర్యబిందువు కాడా?
آية رقم 38
తరువాత ఒక రక్తకండగా (జలగగా) ఉండేవాడు కాదా? తరువాత ఆయనే (అల్లాహ్ యే) అతనిని సృష్టించి అతని రూపాన్ని తీర్చిదిద్దాడు.
آية رقم 39
ఆ తరువాత అతని నుండి స్త్రీ పురుషుల రెండు రకాలను (జాతులను) ఏర్పరచాడు.
آية رقم 40
అలాంటప్పుడు ఆయనకు మరణించిన వారిని మళ్ళీ బ్రతికించే సామర్థ్యం లేదా?
تقدم القراءة